ఖమ్మంలో PDSUలోకి 60 మంది కీలక నాయకుల చేరిక.. ఐక్య విద్యార్థి ఉద్యమాల నిర్మాణానికి పిలుపు!
Khammam Tv
0:00 / 0:00
ఖమ్మంలో PDSUలోకి 60 మంది కీలక నాయకుల చేరిక.. ఐక్య విద్యార్థి ఉద్యమాల నిర్మాణానికి పిలుపు!
76 просмотров · 7 дн. назад
Khammam Tv
28,1 тыс. подписчиков
76 просмотров · 7 дн. назад
నమస్తే. జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. CELL 9705879880
విప్లవ విద్యార్థి సంఘాల ఐక్యతతో బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్మిస్తామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు P మహేష్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు అన్నారు.
RSS, BJP, ప్రధాని నరేంద్ర మోడీ మతతత్వ విధానాలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. విద్యార్థి లోకాన్ని సమీకరించి పోరాటాలు చేస్తామని వారు పేర్కొన్నారు.
CPI ML మాస్ లైన్ అనుబంధ PDSU ఒంటెత్తు పోకడలు, అరాచక, అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకంగా ఆ సంఘానికి రాజీనామా చేశామంటూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ తో పాటు 60 మంది కీలక నాయకులు మాతృ సంస్థ PDSU లో చేరారు.
ఈ మేరకు PDSU ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక లెనిన్ నగర్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయంలో వారందరికీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు.
కార్యక్రమంలో PDSU జిల్లా అధ్యక్షులు గోకినపల్లి మస్తాన్, ఉపాధ్యక్షురాలు ఈశ్వరి, సహాయ కార్యదర్శి వెంకటేష్, శ్రీకాంత్, సాగర్, రాము, మహేష్ తదితరులు పాల్గొన్నారు.