Перейти к содержимому

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వకుళమాత అన్నదాన భవనం ప్రారంభం I Tv7Telugu I Tv7 News Teugu

Tv7 News Telugu

0:00 / 0:00

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వకుళమాత అన్నదాన భవనం ప్రారంభం I Tv7Telugu I Tv7 News Teugu

35 просмотров · 8 дней назад
Tv7 News Telugu
69 подписчиков
35 просмотров · 8 дней назад
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వకుళమాత అన్నదాన భవనం ప్రారంభం .. భవనం ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వకుళమాత అన్నదాన భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడారు. దాదాపు రూ.6.5 కోట్లతో భవనం, మరో రూ.1.5 కోట్లతో ఆధునిక వంటగది, పరికరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామరాజు ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒకే సిట్టింగ్‌లో సుమారు 2,500 మంది భోజనం చేసేలా, రోజుకు 40 వేల నుంచి 50 వేల మందికి సరిపడా వంట చేసే సామర్థ్యంతో అన్నదాన భవనాన్ని తీర్చిదిద్దారు. ఇటీవల వాడపల్లి క్షేత్రానికి దేశవ్యాప్తంగా భక్తుల రాక పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని పేర్కొన్నారు. క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రూ.6 కోట్లతో రహదారి, క్యూలైన్లు, వై-షెల్టర్లు, మరో రూ.12 కోట్లతో గదుల నిర్మాణం వంటి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ ద్వారా మరిన్ని నిధులు తీసుకువచ్చి వాడపల్లి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. భక్తులు సమర్పించే ప్రతి రూపాయినీ వారి సౌకర్యాల కోసమే సద్వినియోగం చేస్తామని పేర్కొన్నారు. ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్), టిడిపి, జనసేన, బిజెపి ముఖ్య నేతలు.