Перейти к содержимому

బ్రహ్మోత్సవం...

Twinkeys

0:00 / 0:00

బ్రహ్మోత్సవం...

127 просмотров · 5 дней назад
Twinkeys
358 подписчиков
127 просмотров · 5 дней назад
This is a Telugu song that is explaining about TTD Brahmotsavam. గీత రచయిత: విశ్వనాథ్ కొండూరి తిరుమలాధీశునకి అంగరంగ వైభవోత్సవం... అండ పిండ బ్రహ్మాండ నాయకునికి ఆశ్వయజమున బ్రహ్మోత్సవం... స్థితి కారకుడైన హరిని స్తుతింపగ చేయు ఈ మహోత్సవం... సాక్ష్యాత్తు సృష్టికారుడే మొదలిడగా  ఆయె బ్రహ్మోత్సవం... నవరాత్రులు జరుగు ఈ వేడుక... వర్ణనాతీతమది కనుల పండుగ...                       శ్రీదేవి, భూదేవి సమేతమ్ముగా... మళయప్ప స్వామి కదలె భక్తుల దీవింపగా... బ్రహ్మ రథమ్ము ముందుండి నడిపింపగా...              మాడ వీధుల్లో తిరిగె ఊరేగింపుగా...  ఏటేటా జరిగేను వెంకన్నకు సాలకట్ల బ్రహ్మోత్సవం... అధిక మాసమున అంతర్యామికి మరో అద్భుతోత్సవం... అంకురార్పణ గావించి....................................సేనాని విశ్వక్సేనుని ఊరేగించి... మీన లగ్నమందున...ధ్వజారోహణముతో ముక్కోటి దేవతలను ఆహ్వానించి...                       పరమపద‌నాథుడే పెదశేష వాహనముపై... ఏడు పడగల నీడలో నడిచె శరణార్ధులనుద్ధరించుటకై... శ్రీనివాస గోవిందా…………..….శ్రీవేంకటేశ గోవిందా... పురాణ పురుషా గోవిందా.....పుండరీకాక్ష గోవిందా... గోవిందా హరి గోవిందా...వేంకట రమణా గోవిందా... రెండవ దినమున అయిదు పడగల చినశేష వాహనమధిరోహించేరు...                                        మురళీ కృష్ణునిలా స్వామి సాక్షాత్కరించేరు... రాత్రికి హంస వాహనముపై డోలలాడేరు...                  భక్తులు స్వామికి జోలపాడేరు... శ్రీనివాస గోవిందా……………….శ్రీవేంకటేశ గోవిందా... గోపీ జనలోలా గోవిందా......గోవర్ధనోద్ధార గోవిందా... గోవిందా హరి గోవిందా...వేంకట రమణా గోవిందా...                              మూడవ నాడు…యోగ నరసింహుడై... సింహ వాహనమెక్కి దుమికె చెడును సంహరించుటకై...         ఆ రాత్రి ముత్యపు పందిరి కాంతులలో... చిన్ని కృష్ణుడు మెరిసె కాళీయమర్ధనునిలా... శ్రీనివాస గోవిందా……………………...శ్రీవేంకటేశ గోవిందా... వరాహ నృసింహ గోవిందా...వామన భృగురామ గోవిందా... గోవిందా హరి గోవిందా……………..వేంకట రమణా గోవిందా... నాల్గవ దినమున గోవుల గోపన్న ఆయె గోవిందుడు...                     కల్ప వృక్ష నీడలో సాగె భక్తవత్సలుడు... ఆనాటి రాత్రికి...బకాసుర వధ గావించిన నందకిశోరునిలా...              సర్వభూపాలమెక్కి ముందుకేగె ముద్దు కృష్ణునిలా... శ్రీనివాస గోవిందా……………...శ్రీవేంకటేశ గోవిందా... వజ్రమకుటధర గోవిందా...విరోధిమర్ధన గోవిందా... గోవిందా హరి గోవిందా...వేంకట రమణా గోవిందా... అయిదవ నాడు...జగన్మోహనుడే ముగ్ధమనోహరి ఆయె...                  ఆ మోహినీ రూపానికి లయకారుడే జత ఆయె... ఆ రాత్రికి...గరుడ సేవ గావించరే...ఆ గరుడగమనునికి... శ్రీనివాస గోవిందా……………....శ్రీవేంకటేశ గోవిందా... పక్షివాహనా గోవిందా.......పాండవ ప్రియ గోవిందా... గోవిందా హరి గోవిందా...వేంకట రమణా గోవిందా... ఆరవ రోజు...హనుమంత వాహనమెక్కె వేంకట రామునిలా...             రాత్రికి గజేంద్రునిపై స్వారీచేసె మోక్షదాయునిలా... శ్రీనివాస గోవిందా……………………..శ్రీవేంకటేశ గోవిందా... దశరధ నందన గోవిందా...దశముఖ మర్ధన గోవిందా... గోవిందా హరి గోవిందా……….వేంకట రమణా గోవిందా... ఏడవ నాడు...సూర్య ప్రభపై కేశవ మూర్తిలా నీ దర్శనం...  నీవే కలియుగ ప్రత్యక్ష దైవమనుటకు కాదా నిదర్శనం... నిను గాంచిన నీ భక్తులకు అయే కదా సర్వరోగ నివారణం...                  నీ చల్లని చూపే గావించదా సకల పాప హరణం... రాత్రికి చంద్ర ప్రభపై కదలి వచ్చేవు చిన్ని కన్నయ్యలా...                                    ముద్దులొలికేవు నవనీత చోరునిలా... శ్రీనివాస గోవిందా……………...శ్రీవేంకటేశ గోవిందా... నంద నందనా గోవిందా...నవనీత చోర గోవిందా... గోవిందా హరి గోవిందా...వేంకట రమణా గోవిందా...                                                           ఎనిమిదవ దినమున... సర్వాంగ సుందరుడై రథోత్సవమున సాగె జగన్నాథుడు...        నమ్మి వెంట నడచిన భక్తులకాయె ఆపద్భాందవుడు... కలియుగ ధర్మమైన అధర్మాన్ని అంతమొందించుటకై...                                     ఖడ్గం చేబూని అశ్వ వాహనమెక్కి... కదులుతున్నాడదిగో.....అల్లదిగో.....కల్కి అవతారమెత్తి... శ్రీనివాస గోవిందా………………...శ్రీవేంకటేశ గోవిందా... దుష్ట సంహార గోవిందా...దురిత నివారణ గోవిందా... గోవిందా హరి గోవిందా…...వేంకట రమణా గోవిందా... ఆఖరి దినమున... పల్లకి ఉత్సవమును చూసి భక్తులు పులకరించేరు...                           శ్రవణ నక్షత్రమందు పుష్కరిణిలో...                         సుదర్శన చక్ర స్నానమాచరించేరు...                                     ధ్వజావరోహణము గావించగా...                                సకల దేవతలకు స్వస్తి పలుకగా... ముగిసెనా అద్భుత ఘట్టం అంగరంగ వైభవముగా... శ్రీనివాస గోవిందా……………….శ్రీవేంకటేశ గోవిందా... కమల దళాక్ష గోవిందా…..కామిత ఫలదా గోవిందా... గోవిందా హరి గోవిందా...వేంకట రమణా గోవిందా...  సాక్ష్యాత్ అష్ట దిక్పాలకులే స్తుతింపగా... సప్త గిరులూ మారుమ్రోగేను అష్టాక్షరితో... ఓం నమో నారాయణాయ... ఓం నమో నారాయణాయ... ఓం నమో నారాయణాయ...