Перейти к содержимому

ARVY క్రికెట్ లీగ్ ఆధ్వ‌ర్యంలో క్రీడాసంబ‌రం l టోర్న‌మెంట్‌లో పాల్గొన్న 12 టీమ్స్ l

Sakshi TV NRI

0:00 / 0:00

ARVY క్రికెట్ లీగ్ ఆధ్వ‌ర్యంలో క్రీడాసంబ‌రం l టోర్న‌మెంట్‌లో పాల్గొన్న 12 టీమ్స్ l

123 просмотра · 4 дня назад
Sakshi TV NRI
67 подписчиков
123 просмотра · 4 дня назад
అమెరికాలోని చికాగోలో ఉన్న తెలుగు కమ్యూనిటీని ఒకే తాటిపైకి తెస్తూ ARVY క్రికెట్ లీగ్ - తొలిసారి నిర్వ‌హించిన చికాగో చాంపియన్‌షిప్ 2026 టోర్నమెంట్, క్రీడాస్ఫూర్తిని చాటింది. ఆర్వీ రెడ్డి, ర‌త్నాక‌ర్ అర్జుల‌, హెచ్ఆర్ పండిట్స్ చైర్మన్ కేకే రెడ్డి గారు సంయుక్త భాగ‌స్వామ్యంతో, ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన ఈ క్రికెట్ టోర్న‌మెంట్, స‌రికొత్త జోష్‌ని నింపింది. ఈ టోర్నీలో మొత్తం 12 జ‌ట్లు హోరాహోరీగా త‌ల‌ప‌డ్డాయి. ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో విన్నర్‌గా తానా టీటీఏ, రన్నరప్‌గా రత్న సెవెన్ జట్టు నిలిచాయి. సాక్షి టీవీ ఎన్నారై, US 1 టీవీ సంయుక్తంగా, ఈ క్రికెట్ లీగ్‌కి మీడియా పార్ట్‌న‌ర్లుగా వ్య‌వ‌హరించాయి. ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించిన లీగ్ గ్రాండ్ ఫినాలే మ్యాచ్‌ను సాక్షి టీవీ ఎన్నారై ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం విశేషం