Перейти к содержимому

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం.

I&PR East Godavari District.

0:00 / 0:00

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం.

156 просмотров · 4 дня назад
I&PR East Godavari District.
1,29 тыс. подписчиков
156 просмотров · 4 дня назад
పత్రికా ప్రకటన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం రూ.23.75 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక వైద్య సదుపాయాలు అత్యవసర, క్రిటికల్ కేర్ సేవలకు మరింత బలోపేతం జి జి హెచ్ లో క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రావడంతో తూర్పు గోదావరి జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యవసర, క్రిటికల్ కేర్, ఐసోలేషన్ తదితర అధునాతన వైద్య సేవలు ప్రభుత్వ రంగంలో మరింత మెరుగ్గా అందుబాటులోకి రానున్నాయనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే లు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) నిధులతో రాజమహేంద్రవరం ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్‌లో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను శనివారం అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. స్థానిక జి జి హెచ్ లో కలెక్టర్, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, భవనం నిర్మాణానికి రూ.23.75 కోట్ల అంచనా వ్యయం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 21 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లను ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఆధునిక బ్లాక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో పెరుగుతున్న వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర వైద్య సేవలు, క్రిటికల్ కేర్, ఐసోలేషన్ వంటి సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి ఈ బ్లాక్ ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల (G+3) నిర్మాణంతో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ఆధునిక ప్రమాణాలతో రూపొందించడం జరిగిందనీ తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో మెటర్నిటీ విభాగంతో పాటు అదనపు లేబర్ రూమ్‌లు, పై అంతస్తుల్లో ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, ఐసోలేషన్ వార్డులు తదితర సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైన ఆధునిక వైద్య పరికరాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని కొన్ని విభాగాలను ఈ నూతన భవనానికి తరలించి, త్వరలో పూర్తిస్థాయి సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్త రకాల వైరస్‌లు, అంటువ్యాధులు, అత్యవసర ఆరోగ్య పరిస్థితులు లేదా ఇతర విపత్తుల సమయంలో రోగులను ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందించేందుకు ఐసోలేషన్ సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోజురోజుకూ పెరుగుతున్న ఔట్ పేషెంట్ రద్దీ, వైద్య సేవల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు, సభాధ్యక్షులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైద్య, విద్యా రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపడుతోందన్నారు. ప్రస్తుతం 650 పడకల సామర్థ్యంతో పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి అదనంగా 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రావడం వల్ల రోగులకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరో 25 నుంచి 30 పడకలను పెంచే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ల కొరతపై వచ్చిన మీడియా కథనాలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిందని శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. కొత్త క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రావడం ద్వారా ఆసుపత్రి సామర్థ్యం మరింత పెరుగుతుందని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రితో నిర్వహించిన ఎమ్మెల్యేల కాన్క్లేవ్‌లో ప్రభుత్వ పనితీరుపై జరిగిన సమీక్షలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించడం అభినందనీయమన్నారు. ఆసుపత్రి అభివృద్ధిలో కృషి చేస్తున్న సూపరింటెండెంట్, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర వైద్య మరియు పరిపాలనా సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రజల నుంచి వచ్చిన ఎక్స్‌రే తదితర సమస్యలకు ఇప్పటికే పరిష్కారం చూపినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య అవసరాలు, సూచనలు, సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రిని మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. భవిష్యత్ వైద్య అవసరాలను ముందుగానే అంచనా వేసి రాష్ట్రవ్యాప్తంగా క్రిటికల్ కేర్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాజమహేంద్రవరంలో జీ+3 నిర్మాణంతో ఆధునిక సదుపాయాలతో ఏర్పాటైన ఈ క్రిటికల్ కేర్ బ్లాక్‌లో అత్యవసర చికిత్స, ఐసోలేషన్ సేవలు అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. నిరుపేదలకు అధునాతన వైద్య సేవలు అందించడంలో ఈ బ్లాక్ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా సోఫియా, apmidc అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. --------- జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి రాజమహేంద్రవరం వారిచే జారీ.