Перейти к содержимому

E459 | ప్రకృతి పద్ధతిలో నిరంతరం పంటల దిగుబడి | లలిత | అన్నమయ్య జిల్లా

Andhra Pradesh Community Managed Natural Farming

0:00 / 0:00

E459 | ప్రకృతి పద్ధతిలో నిరంతరం పంటల దిగుబడి | లలిత | అన్నమయ్య జిల్లా

900 просмотров · 3 дня назад
Andhra Pradesh Community Managed Natural Farming
26,2 тыс. подписчиков
900 просмотров · 3 дня назад
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం సుంకరగుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు దేరంగుల లలిత గతంలో రసాయన వ్యవసాయం చేస్తూ అధిక పెట్టుబడులు, పురుగు మందుల ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తక్కువ ఖర్చుతో వైవిధ్యభరితమైన పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం టమోటాను ప్రధాన పంటగా తీసుకుని మొక్కజొన్న, బంతి, మిరప, గోరుచిక్కుడు, ఆకుకూరలు, ముల్లంగి, క్యారెట్, బీట్‌రూట్, ఉల్లి, పసుపు తదితర పంటలను సాగు చేస్తున్నారు. కాలువల్లో నవధాన్యాలను జీవ ఆచ్చాదనగా సాగు చేయడం ద్వారా భూమిలోని తేమను కాపాడుతున్నారు. కుటుంబంతో కలిసి వ్యవసాయం చేస్తూ, పొలంలో పండిన కూరగాయలను వినియోగిస్తున్నారు. టమోటా లో అధిక దిగుబడి సాధించడంతో చుట్టుపక్కల రైతుల్లో ప్రకృతి వ్యవసాయంపై నమ్మకం, గౌరవం పెరిగింది.