బోగోలు మండలం కప్పరాల తిప్పలో వైసీపీకి షాక్.. జనసేనలోకి సుమారు 40 కుటుంబాలు చేరిక//SR News live
SR News live
0:00 / 0:00
బోగోలు మండలం కప్పరాల తిప్పలో వైసీపీకి షాక్.. జనసేనలోకి సుమారు 40 కుటుంబాలు చేరిక//SR News live
139 просмотров · 10 ч назад
SR News live
2,72 тыс. подписчиков
139 просмотров · 10 ч назад
కావలి: నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరాల తిప్ప గ్రామంలో వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన సుమారు 40 వైసీపీ కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. శుక్రవారం జరిగిన ఈ చేరికల కార్యక్రమం కావలి జనసేన పార్టీ సమన్వయకర్త మన్నెమాల సుకుమార్ రెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
గండూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు గోడ్డేటి బాబు, పీట్ల రమేష్‌తో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కుటుంబాల సభ్యులకు మన్నెమాల సుకుమార్ రెడ్డి జనసేన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై చేరికలు
ఈ సందర్భంగా మన్నెమాల సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై ప్రజలు, నాయకులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.