Перейти к содержимому

26 ఏళ్ల స్నేహం ❤️ తులసి గారు మా గార్డెన్‌కి వచ్చారు ప్రకృతిపై ప్రేమే మా బంధం 🌿

Jayasree Soul Journey

0:00 / 0:00

26 ఏళ్ల స్నేహం ❤️ తులసి గారు మా గార్డెన్‌కి వచ్చారు ప్రకృతిపై ప్రేమే మా బంధం 🌿

1 630 просмотров · 2 недели назад
Jayasree Soul Journey
819 подписчиков
1 630 просмотров · 2 недели назад
11-9-26 26 సంవత్సరాల స్నేహం ❤️ మా కాలనీలో కలిసి ధ్యానం, కోలాటం, ఫంక్షన్స్ ఇలా ఎన్నో సందర్భాల్లో కలుస్తూ వచ్చిన మా తులసి గారు ఈరోజు మా గార్డెన్ చూడటానికి వచ్చారు. 🌿 మొక్కలంటే తులసి గారికి కూడా ఎంతో ఇష్టం. కాళ్లు నొప్పిగా ఉన్నా కూడా గార్డెన్ చూడాలనే ఆసక్తితో మా ఇంటికి రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆవిడ ఇచ్చిన గుమ్మడి మొక్కను మా గార్డెన్‌లో పెంచుతున్నాను. అది బాగా పెరగడం చూసి తులసి గారు కూడా చాలా సంతోషించారు. ఆమె మనవరాలు పరిణిత కూడా గార్డెన్‌ను ఎంతో ఆసక్తిగా చూసింది. ప్రకృతిపై పిల్లలకు కూడా ఇలాంటి ప్రేమ పెరగడం చాలా ఆనందంగా అనిపించింది. ❤️ స్నేహితులతో అప్పుడప్పుడు ఇలా కలుసుకుని మంచి విషయాలు మాట్లాడుకోవడం, మొక్కల మధ్య సమయం గడపడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ వస్తాయి. శుక్రవారం రోజు తులసి గారు మా ఇంటికి రావడం నాకు మహాలక్ష్మి అమ్మవారు వచ్చినట్టుగా ఎంతో ఆనందంగా అనిపించింది. ఆమెకు తాంబూలం ఇచ్చి సంతోషంగా మాట్లాడుకున్న ఆ మధురమైన క్షణాలను మీతో పంచుకుంటున్నాను. 🙏🌿❤️ #Garden #Gardening #NatureLove #Friendship #OrganicGardening #TerraceGarden #JayasreeSoulJourney