Bhargav Deshpande | కాంగ్రెస్ సీనియర్ నేత భార్గవ్ దేశ్ పాండేతో ABP ఇంటర్వ్యూ | ABP Desam
ABP Desam
0:00 / 0:00
Bhargav Deshpande | కాంగ్రెస్ సీనియర్ నేత భార్గవ్ దేశ్ పాండేతో ABP ఇంటర్వ్యూ | ABP Desam
4 180 просмотров · 9 часов назад
ABP Desam
789 тыс. подписчиков
4 180 просмотров · 9 часов назад
#BhargavDeshpande #TelanganaCongress #ABPDesam #TelanganaPolitics #TeluguNews #CongressParty #ExclusiveInterview
Bhargav Deshpande | కాంగ్రెస్ సీనియర్ నేత భార్గవ్ దేశ్ పాండేతో ABP ఇంటర్వ్యూ | ABP Desam
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు రాజకీయాలు మారుతున్నాయి. రాజకీయ నాయకుల్లోనూ వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఓ సీనియర్ కాంగ్రెస్ నేత పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరుతారన్న విషయం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అప్పటి ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన భార్గవ్ దేశ్ పాండే, అంచెలంచెలుగా పార్టీ అధిష్టానం మేరకు ఆదిలాబాద్ డిసిసి అధ్యక్షులుగా కొనసాగారు. 2014లో ఆదిలాబాద్ నుండి సైతం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయిన నాటి నుంచి నేటి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పార్టీ టికెట్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా పార్టీకి దూరమైన ఆయన పార్టీనీ వదలలేదు. ఇటీవలే ఆయన ఆ పార్టీలో తనకు ఎలాంటి ఆదరణ కల్పించలేకపోవడం, ఇతర కారణాల వల్ల పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ భార్గవ్ దేశ్ పాండే కాంగ్రెస్ పార్టీని వదిలి బిఆర్ఎస్ పార్టీలో చేరాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.? 17ఏళ్ల వయస్సులోనే NSUI జెండా చేతబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఎందుకు పార్టీని వీడాలని అనుకుంటున్నారు.? AICC సభ్యునిగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ అగ్రనేతలతో సన్నిహితంగా ఉన్న భార్గవ్ దేశ్ పాండే కాంగ్రెస్ పార్టీనీ వదలడం వెనుక అసలు కారణాలేంటి.? తాతల కాలంగా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే నేతల్లో ఒకరైన ఆయన పార్టీనీ వీడే నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న రిజన్ ఏంటి.? భార్గవ్ దేశ్ పాండే కాంగ్రెస్ పార్టీనీ వదిలి బిఆర్ఎస్ పార్టీలో ఎప్పుడూ చేరబోతున్నారు..? బిఆర్ఎస్ పార్టీలో ఎవరి ఆధ్వర్యంలో ఆయన కండువా కప్పుకోనున్నారు.? ఈ అంశాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భార్గవ్ దేశ్ పాండే తో abp దేశం ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ.
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam