Перейти к содержимому

దేవుని దృష్టిలో మన విలువెంత? | Oct 16 దివ్యబలి పూజా పఠనాలు| today's holymass readings in telugu

Pavithra vaani

0:00 / 0:00

దేవుని దృష్టిలో మన విలువెంత? | Oct 16 దివ్యబలి పూజా పఠనాలు| today's holymass readings in telugu

19 просмотров · 10 дн. назад
Pavithra vaani
43 подписчика
19 просмотров · 10 дн. назад
🙏 దివ్యబలి పూజా పఠనాలు | అక్టోబర్ 16, 2026 | సామాన్య 28వ శుక్రవారం 📖 నేటి బైబిల్ పఠనాలు ✝️ మొదటి పఠనం: ఎఫెసీయులకు 1:11–14 🎵 భక్తి కీర్తన: కీర్తనల గ్రంథము 33:1–2, 4–5, 12–13 🙌 అల్లెలూయా: కీర్తనల గ్రంథము 33:22 📖 సువిశేష పఠనం: లూకా 12:1–7 మొదటి పఠనం  పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1: 11-14 11: సమస్తము దేవుని ప్రణాళికను, నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక, ఆదియందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి, దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు, తన ప్రజలుగ ఎన్నుకొనెను. 12: కనుక, క్రీస్తునందు నిరీక్షణలో ప్రథమ ఫలమైన మనము దైవమహిమను స్తుతింతుముగాక!  13: మీ విషయములోను అంతే! మీకు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్యసందేశమును మీరు ఆలకింపగనే మీరు క్రీస్తును విశ్వసించితిరి. అంతట తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తనవారుగ దేవుడు ధృవ పరచెను 14: దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగ మనము పొందుదుము అనుటకు ఆత్మయే హామీ. ఆయన మహిమను స్తుతింతుముగాక! ఇదీ ప్రభువు వాక్కు  ప్రత్యుత్తర గీతం భక్తి కీర్తన:కీర్తనల గ్రంథము 33: 1 - 2, 4 - 5, 12 - 13   అందరు: ప్రభువు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు  భాగ్యవంతులు. అల్లెలూయా వచనము కీర్తన 33:22 అల్లెలూయా! అల్లెలూయా! ప్రభూ! మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి యుండును గాక ! అల్లెలూయా! సువిశేష పఠనము పునీత లూకా గారు వ్రాసిన సువార్త 12: 1 - 7 1: అంతలో వేలాది ప్రజలు గుమిగూడి తొక్కిసలాడుచుండగా యేసు శిష్యులను ఇట్లు హెచ్చరింప ఆరంభించెను: “పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, అనగా కపట ప్రవర్తనను గూర్చి, మీరు జాగరూకులై ఉండుడు. 2: దాచబడినది ఏదియు బయటపడకపోదు. రహస్యమైనది ఏదియు బట్ట బయలు కాకపోదు. 3: మీరు చీకటిలో చెప్పునది అంతయు వెలుతురులో వినబడును. మీరు మారు మూలల గుసగుసలాడునది అంతయు మిద్దెలపై నుండి చాటబడును. 4: మిత్రులారా! నేను మీతో చెప్పునదేమన, మీరు శరీరమును నాశనము చేయువారికి భయపడకుడు. వారు అంతకుమించి ఏమియు చేయజాలరు. 5: మీరు ఎవనికి భయపడవలెనో చెప్పెదను. మిమ్ములను చంపి, నరకకూపమున పడవేయగల వానికి భయ పడుడు. అవును, వానికి భయపడుడు అని నేను చెప్పుచున్నాను. 6: రెండు కాసులకు ఐదు పిచ్చుకలు అమ్మ బడుటలేదా? కాని, వానిలో దేనినైనను దేవుడు విస్మరింపడు. 7: మీ తలవెంట్రుకలు గూడ లెక్కింపబడి ఉన్నవి. భయపడవలదు. మీరు అనేక పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.” ఇదీ ప్రభువు సువిశేషము ఈ వీడియో మీకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడితే Like చేయండి, మీ కుటుంబ సభ్యులతో Share చేయండి. ప్రతిరోజూ తెలుగు కతోలిక దివ్యబలి పూజా పఠనాల కోసం మా ఛానల్‌ను Subscribe చేసి Bell Icon నొక్కండి. దేవుని వాక్యం మీ కుటుంబానికి శాంతిని, ఆనందాన్ని ప్రసాదించుగాక! ✝️ #TeluguCatholic #దివ్యబలిపూజ #CatholicMassReadings #TeluguBible #DailyMassReadings #CatholicReflectionsTelugu #TeluguCatholicMessages #DailyMassReadings #October16 #CatholicTelugu #BibleReflectionTelugu #ChristianDevotionalTelugu #dailycatholicreadings #catholicgospelreadingfortoday #pavithravaani #catholicprayer