BG6161026శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతియః।స సన్న్యాసీచయోగీచ న నిరగ్నిర్నచాక్రియః
Krishna Prem
0:00 / 0:00
BG6161026శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతియః।స సన్న్యాసీచయోగీచ న నిరగ్నిర్నచాక్రియః
170 просмотров · 2 нед. назад
Krishna Prem
37 подписчиков
170 просмотров · 2 нед. назад
Bhagavad Gita: అధ్యాయం 6, శ్లోకం 1
శ్రీ భగవానువాచ ।
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ।
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః
భగవానువాచ — భగవంతుడు పలికెను; అనాశ్రితః — ఆశించకుండా; కర్మఫలం — పనుల యొక్క ఫలితములు; కార్యం — చేయవలసిన; కర్మ — పని; కరోతి — నిర్వర్తించుట; యః — ఎవరైతే; సః — ఆ మనిషి; సంన్యాసీ — సన్యసించిన; చ — మరియు; యోగీ — యోగి; చ — మరియు; న — కాదు; నిః — లేకుండా; అగ్ని — అగ్ని; న — కాదు; చ — మరియు; అక్రియః — క్రియా రహితంగా
భగవంతుడు పలికెను: ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను (చేయవలసిన విధులను), చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని, కేవలం అగ్ని హోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరిక క్రియలు త్యజించిన వారు కాదు.