చర్మం బంగారంలా మెరిసిపోయే ఆయుర్వేద సున్నిపిండి | DIY Herbal Bath Powder For Babies & Adults
లక్ష్మీ సృజన
0:00 / 0:00
చర్మం బంగారంలా మెరిసిపోయే ఆయుర్వేద సున్నిపిండి | DIY Herbal Bath Powder For Babies & Adults
409 просмотров · 7 дн. назад
లక్ష్మీ సృజన
710 подписчиков
409 просмотров · 7 дн. назад
హలో ఫ్రెండ్స్! ఈరోజు మన వీడియోలో కెమికల్ సబ్బులకు బదులు చర్మాన్ని ఎంతో మృదువుగా, కాంతివంతంగా మార్చే ఆయుర్వేద మూలికల సున్నిపిండిని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో చూపించాను. నేను స్వయంగా మూలికలు తెచ్చి, ఎండబెట్టి, దంచి, మిక్సీ పట్టి తయారుచేసిన పవర్‌ఫుల్ సున్నిపిండి ఇది. ఈ వీడియోలో చూపించిన సున్నిపిండి తయారీకి నేను వాడిన కచ్చితమైన కొలతలను మీకు కింద అందిస్తున్నాను. మీ ఇష్టాన్ని బట్టి, అందుబాటును బట్టి ఈ మూలికల కొలతల లోపు ఎంతైనా వేసుకోవచ్చు. పెద్దవారే కాకుండా చిన్న పిల్లలకు కూడా దీనిని ఎలా వాడాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి.
👉 సున్నిపిండికి కావలసిన పదార్థాలు & కొలతలు (Ingredients List):
పెసరపిండి (బేస్) - 1 కేజీ (1000 గ్రాములు)
శనగపిండి (బేస్) - 200 గ్రాములు
బియ్యప్పిండి (బేస్) - 150 గ్రాములు
[పైన పేర్కొన్న పిండి మిశ్రమానికి కింద తెలిపిన మూలికలను మీ వీలును బట్టి చేర్చుకోండి]
ఆకుపత్రి - 10 గ్రాముల నుండి 30 గ్రాముల వరకు
పచ్చాకు - 10 గ్రాముల నుండి 50 గ్రాముల వరకు
ఉసిరి పొడి - 25 గ్రాముల నుండి 50 గ్రాముల వరకు
తుంగముస్తలు - 20 గ్రాముల నుండి 50 గ్రాముల వరకు
కస్తూరి పసుపు - 5 గ్రాములు
వేపాకు పొడి - 30 గ్రాముల నుండి 40 గ్రాముల వరకు
పొగడపువ్వు - 15 గ్రాముల నుండి 50 గ్రాముల వరకు
గులాబీ రేకుల పొడి - 25 గ్రాముల నుండి 50 గ్రాముల వరకు
గంధ కచ్చూరాలు - 20 గ్రాముల నుండి 40 గ్రాముల వరకు
వట్టివేరు పొడి - 20 గ్రాముల నుండి 50 గ్రాముల వరకు
(గమనిక: పైన పేర్కొన్న కొలతల లోపు మీ వీలును బట్టి, చర్మ తత్వాన్ని బట్టి ఎంతైనా కలుపుకోవచ్చు)
ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్యూ!
#HerbalBathPowder #SunnipindiInTelugu #NaluguPindi #AyurvedicSkinCare #GlowingSkinTips #HomemadeBathPowder #NaturalSkinCare #BabyBathPowder #SkinWhitening #TeluguBeautyTips #PotluriVantalu