Перейти к содержимому

శ్రేయస్సు - ప్రేయస్సు, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః

Sivananda Hrudayam(Satguru Sri Sivananda Murthy)

0:00 / 0:00

శ్రేయస్సు - ప్రేయస్సు, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః

1 546 просмотров · 6 дней назад
Sivananda Hrudayam(Satguru Sri Sivananda Murthy)
1,71 тыс. подписчиков
1 546 просмотров · 6 дней назад
పారిశ్రామిక, కార్మిక విధానాల పరస్పర సంబంధం: ప్రేయస్సు, శ్రేయస్సుల మధ్య వ్యత్యాసం స్వధర్మాచరణ మరియు దైవిక సపోర్ట్ ఆత్మరక్షణగా సాంప్రదాయ పరిరక్షణ కేవలం ధనసహాయం కంటే ఆచరణే ముఖ్యం నైతిక విలువల ఆచరణాత్మక రూపం ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఏమీ లేదు. లేబర్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ. లేబర్ పాలసీ సరిగా లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీ నాశనం అయినట్టే. లేబర్ పాలసీ ఎలా ఉందో ఇండస్ట్రియల్ పాలసీ అలా తీర్చిదిద్దబడుతుంది. లేబర్ పాలసీ ఓరియంటెడ్ రిజల్ట్స్ ఏ ఇండస్ట్రియల్ పాలసీ ఓరియంటేషన్ అవుతుంది. ఈ రెండు వేరు కాదు. What do you mean by industrial policy without labor policy? లేబర్ పాలసీ అంటే లేబరర్స్ కి కంప్లీట్ సపోర్ట్. వాళ్లు స్ట్రైక్ చేసినా వాళ్ల మాటే వినడం, వాళ్లని కంట్రోల్ చేయకపోవడం. రైట్స్ ఏమో వాళ్లకి, రెస్పాన్సిబిలిటీస్ ఏమో మేనేజ్మెంట్ కి. ఒక్క మాటలో చెప్పాలంటే — ఆల్ రైట్స్ వాళ్లకి, రెస్పాన్సిబిలిటీ ఏమో వీళ్లకి. వాళ్లకు రెస్పాన్సిబిలిటీ లేదట, రైట్స్ ఎక్కడ ఉంటే అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఉంటేనే అది బాగుపడుతుంది. మన ఇండస్ట్రియల్ సెక్టర్ అంతా నాశనం కావడానికి అదే కారణం. నన్ను కూడా డిక్టేట్ చేసి ఇచ్చాను అది. ఇవన్నీ సబ్జెక్ట్స్ ఏమిటంటే మన దేశం, మన ప్రజలు, మన సంస్కృతికి సంబంధించినవి. సంబంధం లేకుండా ఎలా వదులుతాం? స్పిరిచువాలిటీ అనేది మన వ్యక్తిగతమైనది. కామక్రోధాలు అనేటువంటివి వ్యక్తిగతం అయితే, స్వార్థం కోసం కామక్రోధాలు పుడితే అది దోషం. క్రోధం, ద్వేషం అనేటటువంటివి ప్రశాంతమైన తాత్విక చింతనకు, ఆధ్యాత్మిక చింతనకు శత్రువే. కానీ అది ధర్మం కొరకు అయితే, ధర్మాన్ని మీరు నిర్వహించి లోకానికి రుణం తీర్చుకోవడం చేత అందులో మనం చచ్చినా సరే, జయించినా సరే పర్వాలేదు. అందులో ప్రవేశిస్తే ఏ రిజల్ట్ వచ్చినా వికారం లేకుండా "నా పని నేను చేశాను, ఓడిపోయాను లేదా గెలిచాను" అని అనుకోవచ్చు. "స్వధర్మే నిధనం శ్రేయః" — స్వధర్మం లో చచ్చిపోయినా శ్రేయస్సే అంటాడు. శ్రేయస్సు, ప్రేయస్సు అని రెండు ఉన్నాయి. ప్రేయస్సు: ఇల్లు, వాకిలి, ధనం, పదవి, గౌరవం, సమాజం, దారా పుత్రుల పోషణ, వాళ్ల ఔన్నత్యం కోసం పాటుపడడం. ఇది ఎంత సంపాదించినప్పటికీ ఈ జన్మతోనే ఫలితాలు వస్తాయి తప్ప పైలోకానికి తీసుకెళ్లేవి కావు. శ్రేయస్సు: జీవాత్మ ఊర్థ్వగతికి ఎలా వెళ్లాలి, జ్ఞానం ఎలా కలుగుతుంది అనే భావన ఉన్నవాడు శ్రేయస్కాముడు. ఇది ధర్మం కోసం నిస్వార్థంగా, లోకక్షేమం కోసం ఎన్నుకున్నటువంటిది. ఇందులో క్రోధం వచ్చినప్పటికీ వ్యక్తిగతమైన పాపం రాదు. కానీ తపస్సు, ఏకాగ్రతతో శాంతచిత్తంతో తపస్సు చేయడానికి ఈ క్రోధం అడ్డు వస్తుంది. నీ స్వధర్మాచరణ చేయకపోవడం చేత వచ్చిన రుణాలే నీ అశాంతికి కారణం అవుతున్నాయి. అందుకే నువ్వు నన్ను గురించి ఆలోచించలేకపోతున్నావు. ఈ ధర్మాన్ని ఆచరించు, యుద్ధం చేయి. చనిపోతే స్వర్గానికి పోతావ్, బతికుంటే రాజ్యం ఏలుకుంటావ్. రెండూ ఒకటే అని ఒకే దృష్టితో తీసుకో. మోక్షానికి మార్గంలో ఏది అడ్డువస్తుందో ఆ అడ్డు తొలగించుకోవడానికి నేను చెప్తున్నాను. ఈ పని నువ్వు చేసి తర్వాత నన్ను గురించి ఆలోచించు, నేను నీ వెనుకాల ఉండనే ఉన్నాను. ముందున్నాడు సారథిగా, వెనుకున్నాడు సపోర్టర్ గా. ముందేమో నడిపిస్తాడు, వెనక నుంచి అదృశ్యంగా సపోర్ట్ చేస్తాడు. Support from behind, leading from the front. యుద్ధం చేసేవాడికి చలి వేస్తుంటే రెండు బ్లాంకెట్స్, బూట్లు, అన్నం తినడానికి బియ్యం మూట కట్టిస్తే మనం కూడా యుద్ధం చేసినట్టే. ప్రతి పౌరుడు దీనికి దోహదం చేయాలి. ఇది రాజకీయం కాదు, ధర్మయుద్ధం. ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాం. ఈ తరుణంలో మనం చేయకపోతే పెద్దవాళ్లు కూడా వివేకం లేకుండా మాట్లాడుతున్నారు. హిందూ ధర్మంలో ఉండి, గుడికి వెళ్లేవాళ్లంతా మూర్ఖులు, వాళ్లకేం అర్థం కావడం లేదు అంటున్నారు. ఇది సంఘర్షణ కాదు, ఆత్మరక్షణ. సొంత సాంప్రదాయాన్ని కాపాడుకునే ప్రయత్నం. కన్స్యూమరిజం గురించి రాసిన వారి కొడుకులు, మనవళ్లు గ్లోబలైజ్ అయ్యారు. మనం ఈ వ్యాల్యూస్ గురించి మాట్లాడుతున్నాం. గట్టిగా ప్రశ్న వేస్తే ఇదే ఆన్సర్. కంచికామకోటి స్వాముల వారి దగ్గరికి ఒక రిటైర్డ్ జడ్జి వచ్చి ₹50,000 చెక్కు ఇస్తూ "వేదాన్ని పోషించడానికి ఇవ్వదలుచుకున్నాను" అన్నాడు. స్వామివారు విని "చాలా సంతోషం. కానీ మీ ఇంట్లో మీ కొడుకులు గాని, మీరు గాని ఎప్పుడైనా రెండు వేద మంత్రాలు లేదా వేదంలో ఒక శాఖను చదివారా?" అని అడిగారు. ఆయన "లేదండి" అన్నాడు. అప్పుడు స్వామివారు "వేదాన్ని పోషించడం అంటే దానిని అనుసరించడం అని అర్థం. మీరు రిటైర్ అయ్యారు కాబట్టి రుద్రం, నమకం, చమకం, పురుషసూక్తం చదువుకొని సదాచారంతో నా దగ్గరికి వస్తే అప్పుడు తీసుకుంటాను, ప్రస్తుతం ఇది మీ దగ్గరే ఉంచండి" అన్నారు. వీళ్లకి ప్రపంచంలో హిందూయిజం గురించిన కాన్సెప్ట్ లేదు. గుళ్లోకి వెళ్లేవాళ్లు మూర్ఖుల్లా కనిపిస్తారు. సోషల్ వ్యాల్యూస్, మోరల్ వ్యాల్యూస్ అని ఊరికే మాట్లాడతారు. మోరల్ వ్యాల్యూస్ తీసుకొచ్చేది రిలీజనా, స్పిరిచువాలిటీయా? శృంగేరి స్వాములవారు వచ్చి లెక్చర్ ఇస్తే విద్యార్థులు వింటారా? వినరు, లెక్చరర్సే వినలేరు. ఆచరించడమే కాదు, దేశంలో దానికి క్షీణదశ వచ్చినప్పుడు పోరాడటం కూడా అవసరం.