❤గజల్❤ 312 విరహంతో మగువ మనసు చేసే ఆరోపణలు
భావగీతికలు
0:00 / 0:00
❤గజల్❤ 312 విరహంతో మగువ మనసు చేసే ఆరోపణలు
33 просмотра · 10 дн. назад
భావగీతికలు
9 подписчиков
33 просмотра · 10 дн. назад
రాసానొక ప్రేమలేఖ చిరునామా చెప్పవేంటి
దాచానిక పంపలేక చదవాలని అడగవేంటి
నా తోడై ఉంటావని ఎన్నికలలు కన్నానో
కాసేపైనా గానీ ఎదుట నిలిచి ఉండవేంటి
ప్రేమసిరులు కావాలని ఎన్ని సార్లు అడిగానో
మాట దాటవేస్తూ ఒకసారైనా ఇవ్వవేంటి
ఆమని మన ప్రేమవనం లోకి అడుగు పెట్టదేమి
వన్నెలతో పరిమళాల వలపువిరులు పూయవేంటి
అనుక్షణం మురిపాలను పంచాలని కోరలేదు
ఒక్కమాటలో నైనా నీ ప్రేమను చూపవేంటి
నీకోసం విరహంతో కవితలెన్ని రాసానో
అందంగా ఉండే నా పేరైనా రాయవేంటి
నీ తత్వం సమ్మతమే కాదన్నా ఈ 'హంసా'
చిత్రంగా నా తలపును వీడి నువ్వు వెళ్ళవేంటి
✍️ గజల్ రచన
@హంసగీతి
24.9.26