మరువను దేవా మా యేసుప్రభువా / Song - 265 (Tune - 2)
క్రైస్తవ సునాద కీర్తనలు
0:00 / 0:00
మరువను దేవా మా యేసుప్రభువా / Song - 265 (Tune - 2)
30 просмотров · 2 нед. назад
క్రైస్తవ సునాద కీర్తనలు
113 подписчиков
30 просмотров · 2 нед. назад
మరువను దేవా మా యేసుప్రభువా - వేకువనే నిన్ వెదకెద దేవా
మహోన్నతుడా ! మారనిదేవా - ఎన్నటికి నన్ విడువనంటివే
1. ముదమున నాదు హృదయ ధ్యానముల్ - ఉదయకాలమే కాచియుంచెదన్
నీళ్ళులేకయే ఎండిన భూమి - చందమువలె నీ సన్నిధినుంటిని
2. అంచితముగ నా మంచము మీదనే - నిను జ్ఞాపకము చేసికొందును
క్రొవ్వు మెదడులే దొరికినట్లుగా - ఉల్లసించెదన్ స్తుతియించెదను
3. ఎన్నిక లేని మన్నుకు నీదు - ఉన్నతరూపం నిచ్చిన దేవా
నీ జీవాత్మను నాలో ఊది - శాశ్వత ప్రేమను చూపిన దేవా
4.జీవము కంటే నీ కృపోత్తమం - చావునుండి నన్ లేపితివయ్యా
పరిశుద్ధులలో యాజక గుంపులో - రాజులవలె నన్ రక్షించితివే
5. అగణిత పాపిని అగ్నిపాత్రుని - ఆమరణాంతం కరుణించితివే
నిత్యజీవము నిండు నెమ్మది - ఇచ్చిన దేవా నీకే స్తోత్రము
6. హింసలు బాధలు కరవు ఖడ్గముల్ - నీ కృపనుండి నన్ యెడబాపవని
నమ్మితినయ్యా నెమ్మది నియ్యము - ఈ పగలంతా జీవితమంతా