రాత్రియయ్యెన న్నెడఁబాయకు / Song - 272
క్రైస్తవ సునాద కీర్తనలు
0:00 / 0:00
రాత్రియయ్యెన న్నెడఁబాయకు / Song - 272
11 просмотров · 9 дней назад
క్రైస్తవ సునాద కీర్తనలు
114 подписчиков
11 просмотров · 9 дней назад
రాత్రియయ్యెన న్నెడఁబాయకు - ధాత్రిపైఁ జీఁకతులుఁ గ్రమ్మెను
సహాయ మేమి లేనివారికి - సహాయుఁడా, నన్ బాసిపోకుమీ.
1.ఏకాలంబైన నీ సహాయము - లేక పిశాచిన్ గెల్వఁజాలను
నీకంటె నాకు లేదుగా - లోక ప్రకాశుఁడా, నన్ బాయకు.
2.నా చెంత నీవు చేరియుండఁగ - ఏ చింతయైన నన్ను సోకునా
ఏ శత్రువైన నన్ను గెల్చునా? - నా శైలమా, నన్ బాసిపోకుమా.
3.సమృద్ధుఁడు సహాయుఁ డాయెను - ఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా?
సమాధి నీకు జయమబ్బునా? - మా మధ్యమున్ సర్వేశ పాయకు.
4.రేవు నేఁ జేరఁబోవు వేళలోన్ - కావుమయ్యా నీ దీప్తిఁ జూపుచున్
చావు జీవంబులందు నైనను - నీవు తోడై నన్ బాసిపోకుము.