Перейти к содержимому

28 సామాన్య బుధవారం దివ్యబలి పూజా పఠనాలు | పరిశుద్ధాత్మ ఫలాలు ఎలా పొందాలి?| Today's catholic readings

Pavithra vaani

0:00 / 0:00

28 సామాన్య బుధవారం దివ్యబలి పూజా పఠనాలు | పరిశుద్ధాత్మ ఫలాలు ఎలా పొందాలి?| Today's catholic readings

37 просмотров · 12 дн. назад
Pavithra vaani
42 подписчика
37 просмотров · 12 дн. назад
సామాన్య 28వ బుధవారం దివ్య పూజా పఠనాలు మరియు దైవ వాక్య ధ్యానము.  ఈ నాటి వాక్య భాగములలో పౌలు గారు గలతీయులకు వ్రాసిన లేఖ ద్వారా పరిశుద్ధాత్మ ఫలముల ప్రాముఖ్యతను, లూకా సువార్త ద్వారా నిజమైన భక్తి మరియు అంతరంగ శుద్ధి గురించిన ప్రభువు బోధలను ధ్యానించుకుందాం. 📖 ఈ నాటి పఠనములు (Readings): • మొదటి పఠనము: గలతీయులకు 5:18 - 25 • భక్తి కీర్తన: కీర్తన 1:1 - 2, 3, 4, 6 • సువిశేష పఠనము: లూకా 11:42 - 46 మొదటి పఠనము పునీత చిన్నప్ప గలతీయులకు వ్రాసిన లేఖ 5: 18 - 25 18: కాని ఆత్మయే మిమ్ము నడిపినచో, మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. 19: శరీర కార్యములు స్పష్టమే. అవి ఏవన: జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 20: విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, 21: మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు వినోదములు మొదలగునవి. పూర్వమువలె ఇప్పుడును నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. ఇట్టి పనులు చేయు వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. 22: కాని ఆత్మఫలములు ఏమనగ: ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, 23: సాత్త్వికత, నిగ్రహము. వీనికి వ్యతిరేకముగ ఎట్టి చట్టమును లేదు. 24: క్రీస్తుయేసునకు చెందినవారు వ్యామోహములతోను, కాంక్షలతోను కూడిన తమ శరీరమును సిలువవేసిరి. 25: మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైనచో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ప్రత్యుత్తర గీతం భక్తి కీర్తన: భక్తి కీర్తన 1: 1 - 2, 3, 4, 6 అందరు: ప్రభుా! నిన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును. అల్లెలూయా వచనము లూకా 1:28 అల్లెలూయా!అల్లెలూయా! అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు.అల్లెలూయా! సువిశేష పఠనము పునీత లూకా గారు వ్రాసిన సువార్త 11: 42 - 46 42: “అయ్యో పరిసయ్యులారా! మీకు అనర్గము. మీరు పుదీనా, సదాప మొదలగు ప్రతి ఆకుకూరలోను పదియవవంతును చెల్లించుచున్నారు. కాని, న్యాయ మును, దైవప్రేమను ఉపేక్షించుచున్నారు. వానిని చెల్లింపవలసినదే. కాని వీనిని నిర్లక్ష్యము చేయరాదు. 43: అయ్యో పరిసయ్యులారా! మీకు అనర్ధము. మీరు ప్రార్థనామందిరములందు ప్రధానఆసనములను, అంగడి వీధులయందు వందనములను అందుకొనుటకు కాంక్షింతురు. 44: అయ్యో పరిసయ్యులారా! మీకు అనర్థము. ఏలయన మీరు కనబడని సమాధులవలె ఉన్నారు. అవి సమాధులు అని తెలియకయే మనుష్యులు వానిపై నడచుచున్నారు.” 45: అపుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు “బోధకుడా! ఇట్టి మాటలతో నీవు మమ్ములను కూడ నిందించుచున్నావు” అనెను. 46: అందుకు యేసు “అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా! మీకు అనర్గము. మీరు మోయసాధ్యముకాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని, వారు ఆ భారములను మోయుటకు వారికి సహాయముగా మీ చిటికెన వ్రేలైనను కదపరు. 🔔 దైవ వాక్యం ప్రతిరోజూ పొందడానికి మా ఛానెల్‌ని Subcribe చేయండి: @Pavithravaanitelugu 👍 లైక్ చేయండి | 💬 మీ ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్‌లో తెలపండి | 🔄 ఇతరులతో పంచుకోండి #PavithraVaani #TeluguCatholicMassReadings #TeluguCatholicReadings #DivyaBaliPoojaPathanalu #TeluguCatholicGospel #CatholicDailyReadings #DailyScriptureTelugu #TeluguCatholic #catholicprayer #catholicbible #dailycatholicreadings #holymassreadings #christiandevotional #catholicdevotional