కడప మేయర్ కాంగ్రెస్‌దే — 66 డివిజన్లలో 35 డివిజన్లను కాంగ్రెస్ గెలుస్తుంది…— సయ్యద్ గౌస్ పీర్..
V7 MEDIA NEWS
0:00 / 0:00
కడప మేయర్ కాంగ్రెస్‌దే — 66 డివిజన్లలో 35 డివిజన్లను కాంగ్రెస్ గెలుస్తుంది…— సయ్యద్ గౌస్ పీర్..
92 просмотра · 11 дней назад
V7 MEDIA NEWS
458 подписчиков
92 просмотра · 11 дней назад
ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చెయ్యాలని చూస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు…
కడప మేయర్ కాంగ్రెస్‌దే — 66 డివిజన్లలో 35 డివిజన్లను కాంగ్రెస్ గెలుస్తుంది…
— సయ్యద్ గౌస్ పీర్, కడప నగర కాంగ్రెస్ అధ్యక్షులు
కడప నగరంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిందేనని కడప నగర కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ స్పష్టం చేశారు.
ఈరోజు టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షులు వాసు గారికి, వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా గారికి ఒక విషయాన్ని స్పష్టంగా హెచ్చరించానని ఆయన తెలిపారు.
“మేము ఏకగ్రీవాలు చేస్తాం” అంటూ టీడీపీ, వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకుంటున్నారని, అయితే ఎన్నికలు ఏకగ్రీవాల కోసం కాదని, ప్రజలు తమ ఓటు హక్కుతో తమ ప్రతినిధులను ఎన్నుకోవడం కోసం అని గౌస్ పీర్ అన్నారు.
కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం ప్రజల ఓటు హక్కును కాలరాసే విధంగా ఏకగ్రీవాలు చేసుకోవడానికి ఎవరినీ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
“ఎన్నికలు ప్రజల ద్వారా, ఓటు ద్వారా, రాజ్యాంగం ప్రకారం జరగాలి. ప్రజలకు తమ నాయకులను ఎన్నుకునే హక్కు ఉండాలి. ఆ హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ చివరి వరకు పోరాడుతుంది. అవసరమైతే రాజ్యాంగబద్ధంగా, న్యాయపరంగా కూడా పోరాడి ఎన్నికలు జరిగేలా చేస్తాం.” అని గౌస్ పీర్ తెలిపారు.
కడప నగర మేయర్ పదవిపై కూడా గౌస్ పీర్ ధీమా వ్యక్తం చేశారు.
“కడప మేయర్ కాంగ్రెస్‌దే. 66 డివిజన్లలో 35 డివిజన్లను కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుచుకుంటుంది. మిగిలిన 31 డివిజన్లలో టీడీపీ, వైసీపీలు ఎవరు ఎంత గెలుస్తారో వారు చూసుకోవాలి. కానీ ప్రజల ఓటుతో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల తీర్పుతో మేయర్ స్థానాన్ని సాధిస్తుంది.” అని ఆయన అన్నారు.
ఏకగ్రీవాల పేరుతో ప్రజలకు ఎన్నికల హక్కును దూరం చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.
“ప్రజల తరఫున కాంగ్రెస్ నిలబడుతుంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కు కోసం ఎంతటి పోరాటానికైనా కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ప్రాణాలు పోయినా ప్రజల ఓటు హక్కు కోసం వెనక్కి తగ్గేది లేదు.” అని గౌస్ పీర్ స్పష్టం చేశారు.
కడప ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుని, తమకు నచ్చిన నాయకులను ఎన్నుకునే అవకాశం పొందే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో నగర ఉపాధ్యక్షులు సౌదాగర్ సాదిక్, ఫజరుల్లా, యూత్ కాంగ్రెస్ నాయకులు సిద్ధిక్, డివిజన్ ఇంచార్జిలు షేక్ అన్వర్, మహబూబ్ బాషా, సయ్యద్ అన్వర్, గఫార్, హాజీ, మురాద్ భాష, సుబ్రహ్మణ్యం తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.