కడప 26 డివిజన్లో గణేష్ ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం పాల్గొన్న. .కాంగ్రెస్ నగర అధ్యక్షులు గౌస్ పీర్
V7 MEDIA NEWS
0:00 / 0:00
కడప 26 డివిజన్లో గణేష్ ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం పాల్గొన్న. .కాంగ్రెస్ నగర అధ్యక్షులు గౌస్ పీర్
34 просмотра · 6 дней назад
V7 MEDIA NEWS
458 подписчиков
34 просмотра · 6 дней назад
గణేష్ ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం — పాల్గొన్న కాంగ్రెస్ కడప నగర అధ్యక్షులు గౌస్ పీర్
కడప: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మాసాపేట 6వ వీధిలోని రాములవారి ఆలయం వద్ద ఏ.ఆర్.వి. యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కడప నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గౌస్ పీర్ మాట్లాడుతూ, వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
“ఇక్కడి ప్రజలకు ఎప్పుడు, ఎలాంటి ఇబ్బంది వచ్చినా నా వంతు సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటాను. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఏ ప్రజా కార్యక్రమానికైనా కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుండి సహకరిస్తాం” అని గౌస్ పీర్ హామీ ఇచ్చారు.
రాబోయే కడప కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం లభించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సాయి, మురళీకృష్ణ తదితరులు గౌస్ పీర్‌ను ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర ఉపాధ్యక్షులు అంజన్ కుమార్, ఫజరుల్లా, సౌధాకర్, సాదిక్, డివిజన్ ఇన్‌చార్జులు మహబూబ్ బాషా, ముబారక్, సయ్యద్ అన్వర్, షేక్ అన్వార్, సిద్ధిక్, మురాద్, ఆరిఫ్, హేమచంద్ర, ఏ.ఆర్.వి. యూత్ సభ్యులు ఎన్.డి. విజయ్, చైతన్య తదితర కాంగ్రెస్ నాయకులు, కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.