Перейти к содержимому

మీ పాత బండికి కలుపు తీసే నాగలి తయారు చేస్తం : Bike Weeder నిజాముద్దీన్ | Telugu రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

మీ పాత బండికి కలుపు తీసే నాగలి తయారు చేస్తం : Bike Weeder నిజాముద్దీన్ | Telugu రైతు బడి

191 593 просмотра · 5 л. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
191 593 просмотра · 5 л. назад
వెల్డింగ్ పనిలో 40 సంవత్సరాల అనుభవం కలిగిన మహ్మద్ నిజాముద్దీన్ గారు.. ఈ వీడియోలో పాత మోటార్ సైకిల్ కు వీడర్ సెట్ చేసే విధానం గురించి వివరించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో పెద్ద గడియారం చౌరస్తాకు సమీపంలో వెల్డింగ్ షాప్ నడుపుతున్న నిజాముద్దీన్ గారు.. ఆల్టరేషన్ పని చేయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. బైక్ కు గుంటుక, మూడు పండ్ల నాగలి వంటివి సెట్ చేస్తారు. అయితే.. ఆయా యంత్రాల వాడుక గురించి అవగాహన కలిగి ఉండటంతోపాటు.. సొంతంగా వాటిని వాడుకోగలిగే రైతులు మాత్రమే ఇలాంటి వాటిని తయారు చేయించుకుంటే కొంత వరకైనా ఫలితం పొందవచ్చు. మీ ప్రాంతంలో కూడా ఇలాంటి ఆల్టరేషన్ వర్క్ చేసే వాళ్లు కచ్చితంగా ఉంటారు. వారిని సంప్రదించి మీకు కావాల్సిన విధంగా తయారు చేయించుకోవచ్చని కూడా గమనించగలరు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : మీ పాత బండికి కలుపు తీసే నాగలి తయారు చేస్తం : నిజాముద్దీన్ | Telugu రైతు బడి #RythuBadi #రైతుబడి #BikeWeeder