Перейти к содержимому

నేలకొరిగిన అమరవీరుల తలసిన నాగన్న ఏడనీ కొండకోనాలు అడుగుతున్నాయో

Ashok dekka

0:00 / 0:00

నేలకొరిగిన అమరవీరుల తలసిన నాగన్న ఏడనీ కొండకోనాలు అడుగుతున్నాయో

27 066 просмотров · 1 месяц назад
Ashok dekka
271 подписчик
27 066 просмотров · 1 месяц назад
"నేలకొరిగిన అమరవీరుల తలసిన నాగన్న ఏడని" అమరవీరుల త్యాగాలకు, బడుగు జీవుల పోరాటానికి నిలువెత్తు నివాళి - "నాగన్న" యాభైఏండ్ల యుద్ధభూమిలో కంచు కంఠమే ఖడ్గమై, గాయపడ్డ బతుకులకు గేయమై పాడిన మహనీయుడి స్మృతిలో ఈ పాట. పల్లె పల్లెల గొంతుగా, అరుణోదయకు అడవి తల్లికి అమర గీతికగా నిలిచిన నాగన్న గురించి... *Credits:* Singer & Writer: DEKKA ASHOK Music: Veda Recording Studio DOP & Editing: Rajesh Patel Producer: Dasari Bhaskar Label: Austin #Naganna #DekkaAshok #PrajaPaata #AmaraveerulaSmrithi #JanaNatyaMandali #TelanganaSongs నేలకొరిగినా అమరవీరుల తలిసిన నాగన్న ఏడని కొండకోనలడుగుతున్నాయో నా ఎర్రమల్లెలు గుండె చెదిరి ఎదురుచూసిన్లో త్యాగాలతోవలు ఎర్ర ఎర్రని దారులల్లో ఎర్రని ఆ సూర్యుడేడని ఎర్రజెండాలడుగుతున్నాయో నాగన్న ఏడని అడవి మల్లెలడుగుతున్నాయో ఆ గానమేదని పావురాల రెక్కలిరిసే రక్కసి పరిపాలనుంటే దిక్కులేని బక్క జీవుల దిక్కుగా ఆ అన్నలుండే అన్నలా ఆలికిడి తానై అండగా నాగన్న ఉండే తూటతో ఉపిరి పోతే పాటతో ప్రాణాలు పోసే యాబైఎండ్ల యుద్ధభూమిలో కంచు కంఠమే ఖడ్గమై అరుణోదయతో అడవి తల్లికి అమర గీతికైనాడు ఎన్నడూ తలవంచలేదుఆశలకు తను లొంగలేదు ఆశయాలను మరువలేదు విప్లవాలను విడువలేదు గో దావరి లోయలోనా ఊయలై ఊగినాడు గాయపడ్డ బతుకులాకు గేయమై పాడినాడు భారతానా బడుగు జీవుల బానిలెన్నో కట్టినాడు బాధలన్నీ పోయేటట్టు కుట్రలెన్నో విప్పినాడు ఉషోదయముకు ముందు లేసి ఉద్యమాల బాట నడిసి కమ్యూనిజమే నిజమని జనం అందరికీ నిజమేంటో తెలిపి కుల మతాల పేర పీడిత ప్రజలను పీడిస్త ఉంటే అభిమతాల విలువ చెప్పి అభ్యుదయమే నింపినాడు భౌతికంగా దూరమై ప్రయోగశాలకు దగ్గరైనా విప్లవాల గొంతుకై అజేయుడై వర్ధిల్లుతావు విప్లవాల గొంతుకై అజేయుడై వర్ధిల్లుతావు విప్లవాల గొంతుకై అజేయుడై వర్ధిల్లుతావు