సొయా రైస్ | Soya Rice | Healthy High Protein Meal | Quick Lunch Box Recipe | Variety Rice
HomeCookingTelugu
0:00 / 0:00
సొయా రైస్ | Soya Rice | Healthy High Protein Meal | Quick Lunch Box Recipe | Variety Rice
96 973 просмотра · 2 месяца назад
HomeCookingTelugu
267 тыс. подписчиков
96 973 просмотра · 2 месяца назад
📌 Quick & easy one pot recipes 🍲 👉 • One Pot Recipes | Easy One Pot Meals for B...
Explore Our Other Rice Recipes : • Rice Recipes | Variety Rice, Pulao & Fried...
Explore Our Other Variety Rice Recipes : • Variety Rice Recipe | BEST Rice Recipes fo...
సొయా రైస్ | Soya Rice | Healthy High Protein Meal | Quick Lunch Box Recipe | Variety Rice
#soyarice #lunchboxrecipes #varietyrice #highproteinmeals #ricerecipes #healthyrecipes
సొయా రైస్ :
కావాల్సిన పదార్ధాలు :
మీల్ మేకర్ - 2 కప్పులు
ఉప్పు
మిరియాలు - 1 టీస్పూన్
సోంపు గింజలు - 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 6
తరిగిన అల్లం
చింతపండు
నూనె - 2 టేబుల్స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
తరిగిన ఉల్లిపాయలు - 1
తరిగిన పచ్చిమిరపకాయలు - 2
రుబ్బిన మాసాల
పసుపు - 1/4 టీస్పూన్
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాలపొడి - 1 టీస్పూన్
గరం మాసాల పొడి - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
నీళ్ళు - 1/4 కప్పు
ఉడికించిన మీల్ మేకర్
కరివేపాకులు
ఉడికించిన బాసుమతి అన్నం
తరిగిన కొత్తిమీర
కార్డ్స్ :
5 నిముషాలు ఉడకనివ్వాలి
2 నిముషాలు మగ్గనివ్వాలి
తయారీ విధానం :
ముందుగా ఒక రెండు కప్పులు మీల్ మేకర్ అలానే కొద్దిగా ఉప్పు మరుగుతున్న నీళ్ళలో వేసి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి.
ఐదు నిముషాలు తరువాత స్టవ్ ఆఫ్ చేసి మీల్ మేకర్ ను వడకట్టి పక్కనపెట్టుకోవాలి.
తరువాత మాసాల కోసం మిక్సీ జార్ లో మిరియాలు , సోంపు గింజలు , వెల్లుల్లి రెబ్బలు , తరిగిన అల్లం , చింతపండు వేసి రుబ్బుకొని పక్కనపెట్టుకోవాలి.
ఆ తరువాత చల్లారిన మీల్ మేకర్ ను మిగిలిన నీళ్ళు పిండుకొని పక్కనపెట్టుకోవాలి.
ఆ తరువాత కడై లో నూనె , అవ్వలు , జీలకర్ర , వేసి వేపి తరిగిన ఉల్లిపాయలు , తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేపుకోవాలి.
ఉల్లిపాయలు వేగిన తరువాత ముందుగా రుబ్బిపెటుకున్న మాసాల వేసి కలుపుకొని పసుపు , కాశ్మీరీ కారం , జీలకర్ర పొడి , ధనియాలపొడి , గరం మాసాల పొడి , ఉప్పు వేసి అన్ని కలిసేటట్లు కలుపుకోవాలి.
ఆ తరువాత పావు కప్పు నీళ్ళు పోసి కలుపుకొని ఉడికించుకున్న మీల్ మేకర్ వేసి కలిపి కొన్ని కరివేపాకులు వేసుకొని మూత పెట్టి రెండు నిముషాలు మగ్గనివ్వాలి.
రెండు నిముషాలు తరువాత మూత తీసి ఒకసారి కలిపి ఉడికించుకున్న బాసుమతి అన్నం వేసి మాసాల అంత అన్నం కి పటేటట్లు బాగా కలుపుకొని ఫైనల్ గ తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
అంతే అండి వేడి వేడి గ రుచికరం ఐన సొయా రైస్ రెడీ.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...
You can buy our book at https://shop.homecookingshow.in/
Follow us :
Facebook- / homecookingtelugu
Youtube: / homecookingtelugu
Instagram- / home.cooking.telugu
A Ventuno Production : http://www.ventunotech.com