ఆలూ పులావ్ | Aloo Pulao in Telugu | ne Pot Meal | Simple Rice Recipes for Lunch Box | Potato Pulao
HomeCookingTelugu
0:00 / 0:00
ఆలూ పులావ్ | Aloo Pulao in Telugu | ne Pot Meal | Simple Rice Recipes for Lunch Box | Potato Pulao
7 960 просмотров · 11 часов назад
HomeCookingTelugu
266 тыс. подписчиков
7 960 просмотров · 11 часов назад
Explore Our Other Pulao Recipes : • Pulao Recipes | Veg, Chicken & Easy One Po...
ఆలూ పులావ్ | Aloo Pulao In Telugu | ne Pot Meal | Simple Rice Recipes for Lunch Box | Potato Pulao
#AlooPulao #PotatoPulao #PulaoRecipes #OnePotMeal #LunchBoxRecipes #PotatoRecipes #ricerecipes
ఆలూ పులావ్ :
కావాల్సిన పదార్ధాలు :
నీళ్ళు - 700 ml
మసాలా దినుసులు ( జీలకర్ర , సోంపు గింజలు , ధనియాలు , దాల్చిన చెక్క , లవంగాలు , యాలకులు , రతి పువ్వు , జాపత్రి , స్టార్ పువ్వు , మిరియాలు , బిర్యానీ ఆకు )
దంచిన వెల్లుల్లి రెబ్బలు - 7
తరిగిన ఉల్లిపాయ - 1
కొత్తిమీర
నూనె - 2 టేబుల్స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
బిర్యానీ ఆకు - 1
తరిగిన ఉల్లిపాయ - 1
తరిగిన బంగాళాదుంపలు - 2
దంచిన పచ్చిమిరపకాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 టీస్పూన్
తరిగిన టొమాటో - 1
యాక్ని
ఉప్పు - 1/4 టీస్పూన్
నానపెట్టిన బాసుమతి బియ్యం - 1 కప్పు (250ml)
అరా చెక్క నిమ్మ రసం
పచ్చిమిరపకాయలు - 3
గరం మసాలా - 1/2 టీస్పూన్
నెయ్యి - 1 టేబుల్స్పూన్
ఫ్రైడ్ ఆనియన్స్ (ఆప్షనల్)
తరిగిన కొత్తిమీర
కార్డ్స్ :
15 నిముషాలు మరగనివ్వాలి
5 నిముషాలు వేపాలి
5 నిముషాలు మగ్గనివ్వాలి
10 నిముషాలు ఉడకనివ్వాలి
తయారీ విధానం :
ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళు , మసాలా దినుసులు ( జీలకర్ర , సోంపు గింజలు , ధనియాలు , దాల్చిన చెక్క , లవంగాలు , యాలకులు , రతి పువ్వు , జాపత్రి , స్టార్ పువ్వు , మిరియాలు , బిర్యానీ ఆకు ) , దంచిన వెల్లులి రెబ్బలు , తరిగిన పచ్చిమిరపకాయ , కొత్తిమీర వేసి పదిహేను నిముషాలు మరగనివ్వాలి.
పదిహేను నిముషాలు తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళు వడకట్టి పక్కనపెట్టుకోవాలి.
ఆ తరువాత కడై లో నూనె , జీలకర్ర , బిర్యానీ ఆకు , తరిగిన ఉల్లిపాయలు వేసి వేపాలి.
రెండు నిముషాలు తరువాత తరిగిన బంగాళాదుంప ముక్కలు , దంచిన పచ్చిమిరపకాయలు వేసి వేపాలి.
ఆ తరువాత అల్లం వెల్లులి పేస్ట్ , తరిగిన టొమాటో వేసి మగ్గనివ్వాలి.
ఆ తరువాత యాక్ని , కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని నీళ్ళను మరగనివ్వాలి.
నీళ్ళు మరిగిన తరువత ఒక కప్పు నానపెట్టిన బాసుమతి బియ్యం , అరా చెక్క నిమ్మ రసం , మూడు పచ్చిమిరపకాయలు , గరం మసాలా పొడి వేసి కలుపుకొని పది నిముషాలు ఉడకనివ్వాలి.
పది నిముషాలు తరువాత నెయ్యి , ఫ్రైడ్ ఆనియన్స్ , తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టి మరో ఐదు నిముషాలు మగ్గించుకుంటే రుచికరం ఐన ఆలూ పులావ్ రెడీ.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...
You can buy our book at https://shop.homecookingshow.in/
Follow us :
Facebook- / homecookingtelugu
Youtube: / homecookingtelugu
Instagram- / home.cooking.telugu
A Ventuno Production : http://www.ventunotech.com