Перейти к содержимому

బెంగుళూరు పబ్‌లో వివాదం.. IAS Officer Vikas Marmat Booked in Bengaluru | Kuppam | ABP Desam

ABP Desam

0:00 / 0:00

బెంగుళూరు పబ్‌లో వివాదం.. IAS Officer Vikas Marmat Booked in Bengaluru | Kuppam | ABP Desam

48 288 просмотров · 8 ч назад
ABP Desam
787 тыс. подписчиков
48 288 просмотров · 8 ч назад
#VikasMarmat #IASOfficer #BengaluruPubIncident #BengaluruNews #Kuppam #KADA #CubbonParkPolice #KarnatakaNews #ABPTeluguNews #ABPDesam #TeluguNews కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ.. కడ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై.. బెంగళూరులో క్రిమినల్ కేసు నమోదైంది. బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. రెసిడెన్సీ రోడ్డులో ఉన్న కావోర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో.. ఆయన స్థానిక పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 9వ తేదీ.. అర్ధరాత్రి దాటిన తర్వాత బెంగళూరులోని పబ్‌లో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్.. తన నలుగురు స్నేహితులతో కలిసి బార్‌లో ఉన్నారు. పబ్‌లో ఉన్న కస్టమర్ల వయసును ధ్రువీకరించేందుకు.. పోలీసులు గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్న సమయంలో.. ఈ వివాదం తలెత్తింది. ఈ క్రమంలో పోలీసులతో వికాస్ మర్మత్ వాగ్వాదానికి దిగారని... వారితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించి... బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ అరుణ్ సాలుంకే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌తో పాటు అభయ్, ఉదయ్ సింగ్, నితీష్, రోషన్ పేర్లు కూడా కేసులో ఉన్నాయి. పబ్‌లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు. An alleged altercation at a Bengaluru pub has landed Kuppam Area Development Authority (KADA) Project Director and IAS officer Vikas Marmat in legal trouble. According to reports, the incident took place at Cavor Bar and Restaurant on Residency Road after midnight on October 9. During a Central Crime Branch inspection, police officers were checking customers' identity cards to verify their ages. An argument allegedly broke out between the officers and Vikas Marmat, who was reportedly accompanied by four friends. The complaint alleges that the IAS officer behaved aggressively, abused and threatened police personnel, and was involved in an assault. Cubbon Park Police registered a criminal case based on a complaint filed by Inspector Arun Salunke. The names of Vikas Marmat and four other individuals — Abhay, Uday Singh, Nithish, and Roshan — have reportedly been included in the case. Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media:   / abpdesam     / abpdesam     / abpdesam