Перейти к содержимому

పరమగీతము ధ్యానములు // Message No: 50 by పాస్టర్. ఎం. సైలస్ గారు // 28 ఆగస్టు 2026

JPH pydibheemavaram

0:00 / 0:00

పరమగీతము ధ్యానములు // Message No: 50 by పాస్టర్. ఎం. సైలస్ గారు // 28 ఆగస్టు 2026

161 просмотр · Трансляция закончилась 1 месяц назад
JPH pydibheemavaram
823 подписчика
161 просмотр · Трансляция закончилась 1 месяц назад
తేదీ : 28 ఆగస్టు 2026 శుక్రవారం యేసుక్రీస్తు ప్రార్ధనా మందిరం పైడిభీమవరం వర్తమానికులు : పాస్టర్ ఎం. సైలస్ గారు పరమగీతము ధ్యానములు 50 వ వర్తమానం అంశం*: *ప్రియుడును సొంతం చేసుకున్న ప్రియురాలు https://www.youtube.com/live/9IB6d7Is... మూలవాక్యం : పరమగీతము 2:16 నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను పద్మములున్నచోట అతడు మందను మేపుచున్నాడు ★ పై వచనం ప్రియురాలు అయిన షూలమ్మీతి మాట్లాడుచున్న మాట ★ ప్రియుడు అయిన సొలోమోను యేసుక్రీస్తు ప్రభులవారికి సాదృశ్యం ★ ప్రియురాలు అయిన షూలమ్మీతి సంఘమునకు సాదృశ్యం ★ ప్రియుడైన యేసయ్య ను సొంతం చేసుకోవాలి అంటే మనం ఏ లక్షణాలు కలిగి ఉండాలి? పరమగీతము 4:1 నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడు చున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి. ★ పై వచనంలో ప్రియుడు ప్రియురాలుతో ఏ లక్షణాలు కలిగి ఉన్నదో మాటలాడుచు ఉన్నాడు ★ ప్రియుడు ప్రియురాలికి సొంతం అవ్వాలి అంటే నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి ★ ప్రియురాలు అందము కలిగి ఉన్నది. ★ అందము పరిశుధ్ధతకు సూచన ★ పరిశుధ్ధత కలిగి జీవించాలి. లేవీయకాండము 11:45 నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. ★ దేవుడు మనము పరిశుధ్ధత కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు. ★ వాక్యము ద్వారా శుద్ది చేయబడితే మనలో పరిశుధ్ధత కలిగి ఉంటాము. నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడు చున్నవి ★ గువ్వకన్నులు కన్నీటి ప్రార్ధనకు సూచన. 2రాజులు 20:3 యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ★ హిజ్కియా తనకు వచ్చిన మరణకరమైన పరిస్థితిని బట్టి యధార్థహృదయము కలిగి కన్నీటి ప్రార్ధన చేస్తున్నాడు. ★ హిజ్కియా కన్నీటి ప్రార్ధన వలన ఆయుష్షు పొందుకున్నాడు. ★ కన్నీటి ప్రార్ధన అనుభవం కలిగి ఉండాలి. నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి. ★ మంద ఐక్యతకు సూచన ★ ఐక్యత కలిగి జీవించాలి. ఎఫెసీయులకు 4:1 కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, ఎఫెసీయులకు 4:2 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ఎఫెసీయులకు 4:3 ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ★ సంఘము ఐక్యత కలిగి జీవించాలి. అపో.కార్యములు 2:1 పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. అపో.కార్యములు 2:2 అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. అపో.కార్యములు 2:3 మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అపో.కార్యములు 2:4 అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. ★ ఐక్యతను బట్టి అపోస్తలుల సంఘము పరిశుధ్ధాత్మను పొందుకున్నది. కొలస్సీయులకు 2:3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి. ★ యేసయ్య దగ్గర బుద్ది జ్ఞానం సర్వ సంపదలు ఉన్నాయి యేసయ్యను మనం సొంతం చేసుకుంటే ఆయన దగ్గర ఉన్నవి మనకు లభిస్తాయి. ★ ప్రియుడైన యేసయ్య ను సొంతం చేసుకోవాలి అంటే మనలో ఉండవలసిన లక్షణాలు 👇🏻 1. పరిశుధ్ధత కలిగి జీవించాలి. 2. కన్నీటి ప్రార్ధన అనుభవం కలిగి ఉండాలి. 3. ఐక్యత కలిగి జీవించాలి. దేవుడు మనలను దీవించును గాక ఆమేన్ ప్రార్ధనా అవసరతలకు : 9441804941 మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి. యూట్యూబ్ చానల్ 👇🏻    / @jph_pydibheemavaram   వాట్సప్ చానల్ 👇🏻 Follow the JPH PYDIBHEEMAVARAM channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb6E... Instagram channel https://www.instagram.com/jphpydibhee...