Перейти к содержимому

#song 46 || పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ వారి గీతము || రచన: Fr. Praveen Gopu ||

Fr. Praveen Gopu OFM Cap / దేవుని ప్రేమ సందేశం

0:00 / 0:00

#song 46 || పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ వారి గీతము || రచన: Fr. Praveen Gopu ||

1 037 просмотров · 3 нед. назад
Fr. Praveen Gopu OFM Cap / దేవుని ప్రేమ సందేశం
3,32 тыс. подписчиков
1 037 просмотров · 3 нед. назад
#song #francis #assisi #cristiansongs పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారి గీతము పల్లవి: పర్యావరణము... వాతావరణ సంరక్షణ.... జీవమున్న సకల జీవుల సమగ్రతను కాపాడుటకు కష్టించే వారికి, పాలక పునీతుడా! ధన్యజీవి పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారా! వందనం వందనం వందనం. చరణం - 1: సృష్టిలో సృష్టింపబడిన సమస్తముపై దేవుని ప్రేమ సంరక్షణ ఉండునని తెలియజేసి, సృష్టిని దేవుడు మానవునికి అప్పగించి, పవిత్రతను కాపాడాల్సిన బాధ్యతను మానవుడు కలిగి ఉన్నాడని, మానవునికి... మానవునికి మధ్య! ఎట్టి భేదములు లేకుండా... సమానత్వముతో జీవించవలెనని, ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే... తెలియజేసావు. ప్రస్తుత పరిస్థితులలో ఆశాకిరణంగా పిలుచుచున్న సున్నిత స్వభావి, పవిత్రతను కాపాడుకొనిన మహా మనిషీ... ధన్యజీవివి నీవు. చరణం - 2: గడిచిన జీవితమంతా... వృధా అయినదని పశ్చాత్తాపపడి నిట్టూర్చి, మెరుగు పట్టిన వజ్రమై వెలిగావు. ప్రార్థించి, ప్రార్థన ప్రయోజన లోతును! పసిగట్టి, నీలోనే దేవుడున్నాడనే సత్యాన్ని తెలుసుకొని, దేవుడు ప్రేమామయుడు, దేవుడే ఆనందము అని వెలిగెత్తి చాటావు. చరణం - 3: పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ మీ శాంతి ప్రార్థనతో! ప్రతి హృదయాన్ని కదిలించావు ప్రభువా! నీ శాంతి సాధనముగా నన్ను మలచుకొనుము ద్వేషమున్న చోట - ప్రేమను వెదజల్ల నీయుము గాయమున్న చోట - క్షమాపణను చూప నీయుము అవిశ్వాసమున్న చోట - విశ్వాసమును నింప నీయుము నిరాశయున్న చోట - ఆశను పెంచనీయుము అంధకారమున్న చోట - జ్యోతిని వెలిగింప నీయుము విచారము నిండిన చోట - సంతోషము పంచనీయుము ఓ దివ్యనాథా! పరుల ఓదార్పును వెదకుట కంటె పరులను ఓదార్చు వరము నీయుము పరులు నన్ను అర్థము చేసుకొన గోరుట కంటె పరులను అర్థము చేసుకునే గుణము నీయుము పరులు నన్ను ప్రేమించాలని కోరుట కంటె పరులను ప్రేమింప శక్తి నీయుము ఎందుకనగా! ఇచ్చుట ద్వారా - పొందగలము క్షమించుట ద్వారా - క్షమింపబడగలము మరణించుట ద్వారా - నిత్యజీవము పొందగలము చరణం - 4: పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారా! మీ శాంతి ప్రార్థనతో... లోకానికి... లోకంలో ఉన్న సమస్తమునకు... మరి ముఖ్యముగా, మానవునికి మేలుకొలుపు. ధన్య నిత్యజీవిత నిత్యజీవ భాగ్యమును పొందుకున్న, ఓ పునీతుడా! అస్సీసిపురవాసి పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు ప్రార్థించి, మాకునూ... మీ స్వభావమును నేర్పించి, అలవరచుమయా! ముగింపు పల్లవి: పర్యావరణము... వాతావరణ సంరక్షణ.... జీవమున్న సకల జీవుల సమగ్రతను కాపాడుటకు కష్టించే వారికి, పాలక పునీతుడా! ధన్యజీవి పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారా! వందనం... వందనం... వందనం.