#song 48 || జపమాల మాత పండుగ గీతము ||
Fr. Praveen Gopu OFM Cap / దేవుని ప్రేమ సందేశం
0:00 / 0:00
#song 48 || జపమాల మాత పండుగ గీతము ||
7 020 просмотров · 2 нед. назад
Fr. Praveen Gopu OFM Cap / దేవుని ప్రేమ సందేశం
3,32 тыс. подписчиков
7 020 просмотров · 2 нед. назад
#mariansongs #catholicmusic
జపమాల మాత పండుగ గీతము
పల్లవి:
అమ్మా మరియా!
కన్య మరియా!
మా రక్షకుని మాతా!
వందనమమ్మా!
నీ వంటి మలినము లేని మాత ఈ భువిపై లేదమ్మా!
చరణం - 1
నీవు దయగల తల్లివి,
సమస్యలను రూపుమాపే,
పరిష్కార మార్గచూపరివి,
ప్రభువు మార్గమును మా జీవితములలో సిద్ధపరిచే అద్భుతానివి.
చరణం - 2
పండ్రెండు వందల ఎనిమిదవ సంవత్సరములో...
సెయింట్ డొమినిక్ గారికి,
'జపమాల మాతా!' మీరే స్వయంగా జపమాలను ఇచ్చి,
ఈ జపమాల ద్వారా ప్రజలను దేవుని వైపు నడిపించుమని చెప్పారని,
మాకు చరిత్ర చెబుతుంది.
పాపులమైన మాపై,
మీ కనికిరానికి వందనములు తల్లీ!
చరణం - 3
పదిహేను వందల డెబ్బై ఒకటవ సంవత్సరములో జరిగిన లెపాంతో యుద్ధములో,
క్రైస్తవులు జపమాలను ధ్యానించడం వల్లనే విజయం పొందారని,
పోప్ గారు ప్రకటించిన నాటి నుండి,
అక్టోబర్ మాసాన్ని యావత్ ప్రపంచ విశ్వాసులు జపమాల మాసంగా కొనియాడుతున్నాము.
దేవుడు దయచేసిన 'జపమాల' కనికరమునకు...
దేవునికి చేతులు మోడ్చి,
కృతజ్ఞతా... వందనములు తెలుపుతున్నాము.
చరణం - 4
ఇంతో, గొప్ప ధన్యకరమైన జపమాలను మాకు ఒసగినందుకు,
దేవునికి మహిమ,
అమ్మ మరియా మీకు ఘనత ప్రాప్తించునుగాక.
చరణం - 5
అమ్మా మరియా... పరిశుద్ధత కలిగిన తల్లీ,
జపమాల ప్రార్థనను ధ్యానించు వారికి, వారి కుటుంబములకు,
మీ ఆశీస్సులను, దేవుని వరములను
జపమాల మాత నీవు దయచేయుదువు.
మీకే మా వందనమమ్మా!
చరణం - 6
'జపమాల' అంటే యాభై మూడు పూసలు కాదు,
'జపమాల' శక్తివంతమైన ఆయుధం,
'జపమాల' శోధనలను తరిమికొట్టే అతీతమైన మహిమ కలిగిన శక్తి,
జపమాల సాతానుపై యుద్ధం చేసే అస్త్రం,
జపమాల కుటుంబంలో ఐక్యతను ఏర్పరిచే సాధనం,
జపమాల క్రీస్తు ప్రభువు వద్దకు మా మొరలను తీసుకువెళ్లే వాహనం.
చరణం:
దేవుని దయను, కృపను, ధన్యతను, ప్రేమను, ఆధిక్యతను పొందుకున్న,
జపమాల మాతా!
నీ వంటి నడవడికను, నీ వంటి హృదయమును, నీ వంటి విశ్వాసమును, నీ వంటి భక్తిని, నీ వంటి విధేయతను,
మాకునూ అలవరచుము మా యేసుని మాతా!
పల్లవి:
అమ్మా మరియా!
కన్య మరియా!
మా రక్షకుని మాతా!
వందనమమ్మా!
నీ వంటి మలినము లేని మాత ఈ భువిపై లేదమ్మా!