వరాహావతారా! నిన్ను వెదకివెదకి -పెదతిరుమలాచార్య కీర్తన (Varahavutara - Peda Tirumalacharya Keerthana)
Bijjam Brothers
0:00 / 0:00
వరాహావతారా! నిన్ను వెదకివెదకి -పెదతిరుమలాచార్య కీర్తన (Varahavutara - Peda Tirumalacharya Keerthana)
2 732 просмотра · 2 нед. назад
Bijjam Brothers
19,3 тыс. подписчиков
2 732 просмотра · 2 нед. назад
వరాహావతారా! నిన్ను వెదకివెదకి -పెదతిరుమలాచార్య సంకీర్తన (Varahavutara - Peda Tirumalacharya Sankeerthana)
Singer - శ్రీ Deepak గారు; Composer: శ్రీ V B Sai Krishna Yachendra గారు
(Courtesy - TTD & Sri Venkateswara Recording Project)
Lyrics -
వరాహావతారా ! నిన్ను వెదకివెదకి వేసారితిని
నీవు పుట్టించిన బ్రహ్మండంబునకు నమస్కారంబు
అట్టి బ్రహ్మాండమునకు నాధారంబయిన నీ రోమకూపంబునకు దండంబు
అజాండములోని నీ విశ్వరూపంబునకు సాష్టాంగంబు
నీ తిరుపతులకు వందనంబు. చరాచరంబైన నీసృష్టికి నభివాదనంబు
నీ రూపంబు లయిన విగ్రహంబులకు మోడ్పుగేలు
నీ యంతర్యామిత్వంబునకు జోహారు
నీ వున్న శేషాచలంబునకు వందనంబులు సేయుచున్నవాఁడ
అందున్న నీ మూర్తికి శరణు
నన్ను నీ కరుణాదృష్టి నవలోకింపుము నా యజ్ఞానంబు చెఱుపుము
నీ పాదంబులపై భక్తి నా కెల్లపుడుం బాయకుండఁ జేయుము
శ్రీ వేంకటేశ్వరా!