Перейти к содержимому

పార్టీ శ్రేణులకు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపు

Kurnool district Ysrcp Talks

0:00 / 0:00

పార్టీ శ్రేణులకు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపు

616 просмотров · 8 дней назад
Kurnool district Ysrcp Talks
2,27 тыс. подписчиков
616 просмотров · 8 дней назад
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలి పార్టీ శ్రేణులకు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి గారు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి గారి అధ్యక్షతన కర్నూలులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి గారు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కంగాటి శ్రీదేవమ్మ గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న మోసాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన మంచిని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ రూపొందించిన బుక్‌లెట్లను ప్రతి ఇంటికీ అందజేయాలని సూచించారు. అలాగే గ్రామాలు, పట్టణాల్లో ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలే వైఎస్సార్సీపీకి బలమని, పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయాన్ని సాధించడం ఖాయమని కంగాటి శ్రీదేవమ్మ గారు ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసేలా అందరూ సమష్టిగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.