Peda Naruni Roopamu Dharinchi | పేద నరుని రూపము ధరించి |Spl Song Sis.Shobha| Heavenly Grace Church |
Heavenly Grace Indian Church
0:00 / 0:00
Peda Naruni Roopamu Dharinchi | పేద నరుని రూపము ధరించి |Spl Song Sis.Shobha| Heavenly Grace Church |
73 668 просмотров · 10 лет назад
Heavenly Grace Indian Church
17,6 тыс. подписчиков
73 668 просмотров · 10 лет назад
Music By: Bro.Sharath Vattikuti
Heavenly Grace Indian Church |
7421 Amarillo Rd Dublin California USA
www.HeavenlyGrace.Church
పల్లవి: పేద నరుని రూపము దరించి
యేసురాజు నీ చెంత నిలచే
అంగీకరించు మాయనను
1. కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడె
ముళ్ళమకుటము శిరస్సున పెట్టబడె
నింద వేదన శ్రమలను సహించెనేసు
చిందె తనదు రక్తము నీ పాపముకై
దీనుడై నిన్ను పిలుచుచుండె || పేద నరుని ||
2. తలవాల్చుటకు ఇల స్థలమేలేదు
దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు
తన్ను ఆదరించు వారెవరు లేరు
ప్రియ రక్షకుడు శిలువలో వ్రేలాడె
పాట్లుపడె నిన్ను విడిపింపను || పేద నరుని ||
3. ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్
పాపడాగులన్ రక్తముతో కడిగెన్
నీ వ్యాధిని వేదన తొలగింప
నీ శాపము నుండి విడిపింప
సిలువలో విజయము పొందె || పేద నరుని ||
4. మాయలోకమును నీవు నమ్మకుము
మనుష్యుల మనస్సు మారిపోవు నిల
నిత్యదేవుని ప్రేమను నమ్మి నీవు
నిశ్చయముగా ప్రభువులో ఆనందింప
నేడే రమ్ము విశ్వాసముతో || పేద నరుని ||
5. తామసించెద వేల ఓ ప్రియుడా
ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము
ఈ లోకము నీకివ్వని శాంతిని
ఈ దినమే ప్రభువు నీకొసగ
ప్రేమతో నిన్ను పిలచుచుండె || పేద నరుని ||
#PedhaNaruniRoopamuDharinchi #PedaNaruniRupamu
#HeavenlyGraceChurch