Перейти к содержимому

KamredHidma SmruthiGeetham||Parakal Ajay||Hidma full song||#parakalapatalu

Parakala Patalu

0:00 / 0:00

KamredHidma SmruthiGeetham||Parakal Ajay||Hidma full song||#parakalapatalu

507 319 просмотров · 10 мес. назад
Parakala Patalu
4,23 тыс. подписчиков
507 319 просмотров · 10 мес. назад
KamredHidma SmruthiGeetham||Parakala Ajay||Hidma full song||#parakalapatalu #hidmasongs #hidmanewsongs #madvihidmasongs #newadavisongs #teluguhidmasongs #parakalapataluu #parakalaajyapatalu #viplavapatalu #viplavaporupatalu #hidmasongstelugu #hidmasong #hidmasongtelugu #parakalaajayhidmasong #madvihidmatelugusongs #madvihidmatelugusong #parakalaajaymadvihidmatelugusongs రచన:- బొగ్గారపు వెంకన్న గానం:- పరకాల అజయ్ పల్లవి :- కత్తుల వంతెన నెట్టుటిపైన కవాతు చేసిన వీరుడవు సల సల మసిలే ఒంట్లో నెత్తురు దోపిడీపై దండెత్తినవు భగ భగ మండే నిప్పుల కొలిమిలో ఈటెలాగ పదునెక్కినవు హిడ్మా తలవంచని ధైర్యం హిడ్మా పోరాట రూపం హిడ్మా చైతన్య శిఖరం హిడ్మా నీకు లాల్ సలాం ||2|| పుడమిలొ పువ్వర్తి పురుడోసి కన్నది నిన్ను నీ జనని దండకారణ్య దండు దారిలో నడిపించినది ఈ అడవి ఖనిజ సంపదకు కాపలాగా తుపాకీ భుజాన మోయమన్నది హిడ్మా అడివమ్మ కోసమే హిడ్మా వినిపించే నినాదం హిడ్మా సాగింది పయనము హిడ్మా జోహార్లు నీకు ||2|| మట్టిలొ పుట్టిన ఆదివాసుల మనసులొ మనసై కదిలినవు పీడన నీడన మగ్గిన జీవుల స్వరమయ్యి ఘర్జించినవు ఓటమి అంచున ఉన్న ఆశలకు కొత్త చరిత్రను రాసినవు హిడ్మా తనుకాదు నిశ్శబ్దం హిడ్మా సాగించెను సమరం హిడ్మా అణుబాంబులవర్షం హిడ్మా రెడ్ సెల్యూట్ నీకు ||2|| జంగిల్ జమీన హమార అంటూ జన సర్కారునె నడిపినవు మూలవాసుల హక్కుల కొరకు నిత్యం మరణిస్తానన్నవ్ చావో రేవో తేల్చుకుందమని భరిగీసి నువు గెలిచినవు హిడ్మా తనుకాదులె అంతం హిడ్మా మొదలయ్యిన యుద్ధం హిడ్మా మన అందరి స్వప్నం హిడ్మా నీకు లాల్ సలాం ||2||