Перейти к содержимому

##నాగొంతు శృతిలోనా నీకృతినీ లయతోనా పాడనా తీయగా శాంభవి అంటూ అమ్మవారి భజన గీతం లిరిక్స్ క్రింద ఉంది

🕉️ ఉల్లి_దుర్గాప్రసాద్ _నాయుడు 🕉️

0:00 / 0:00

##నాగొంతు శృతిలోనా నీకృతినీ లయతోనా పాడనా తీయగా శాంభవి అంటూ అమ్మవారి భజన గీతం లిరిక్స్ క్రింద ఉంది

13 577 просмотров · 1 год назад
🕉️ ఉల్లి_దుర్గాప్రసాద్ _నాయుడు 🕉️
2,87 тыс. подписчиков
13 577 просмотров · 1 год назад
##శ్రీ వరసిద్ధి వినాయక భక్తి గీతాలు ###శ్రీ సరస్వతీ మాత భక్తి గీతాలు ###శ్రీ బెజవాడ కనకదుర్గ భక్తి గీతాలు ###శ్రీ అయోధ్య రాముని భక్తి గీతాలు ####శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు ####శ్రీ శిరిడి సాయిబాబా భక్తి గీతాలు #####శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్తి గీతాలు #####శ్రీ దుర్గా దేవి భక్తి గీతాలు #####శ్రీ కోదండ రాముల వారి భక్తి గీతాలు ###శ్రీ అభయ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు #####శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు ####అన్నవరం సత్యనారాయణ స్వామి భక్తి గీతాలు #####వివిధ కవులు రచించిన సినీ గేయ భక్తి గీతాలు ######శ్రీ పరమశివుని భక్తి గీతాలు ###సమస్త దేవతల భక్తి గీతాలు రచన: బావిశెట్టి అప్పన్న దొరగారు సింగర్ :రామకృష్ణ హార్మోనియం:దుర్గాప్రసాద్ డోలక్: శ్రీనివాస్ జానకి రాముడు: (నా గొంతు శృతిలోనా) రేవతి రాగం: (ప):నా గొంతు శృతిలోనా నీ కృతిని లయతోనా పాడనా తీయగా శాంభవి వేడనా భక్తితోడ విజయభార్గవి.. చ1:. ఇలలోన బెజవాడలో ఇంద్రకీలాద్రి ఆవాసమై కలిలో కష్టాలనే కడతేర్చు మాయమ్మవై పిలిచినా పలికేటి ఇలవేల్పువై కొలిచినావరమిచ్చే మా భాగ్యమై కలతలే బాపినా కోర్కెలే తీర్చినా కనకదుర్గమ్మవై కదలిరా కదలిరా కల్పవల్లివై తోడుగా నీడగా అందదండవై చ2:. ఒక పూవు పది పూవులై అది మాల కావాలనీ ఒక పాట పది పాటలై అది గానమవ్వాలనీ ఆ మాలనే నీ మెడను వెయ్యాలనీ ఆ గానమే నీ కొరకై పాడాలనీ హృదయమే మందిరమై అందునీవు దేవతవై కొలువై వుండాలనీ పిలిచినా తలచినా కానరావా తోడుగా నీడగా బ్రోవరావా చ3: భువిలోన అప్పాపురం భవ అప్పన్న దాసార్పితం దైవాలకే దైవమా అష్టాదశ శక్తి నవ పీఠమా పావనం నీ నామ గానామృతం నా భావాన అనునిత్య సంకీర్తనం గానమే ప్రాణమై ధ్యానమే ధ్యేయమై నిను నేను చేరాలనీ చేరనా చేరనా సన్నిధానం భక్తితో ముక్తి కై మోక్షమార్గం