అంశము:-యేసు మన కొరకు ఏమాయెను ?
Church of Christ jayaraju
0:00 / 0:00
అంశము:-యేసు మన కొరకు ఏమాయెను ?
190 просмотров · 7 дней назад
Church of Christ jayaraju
304 подписчика
190 просмотров · 7 дней назад
అంశము:-యేసు మన కొరకు
ఏమాయెను ?
------------------------------
A.దరిద్రుడాయెను
------------------------------
2కొరింథి8:9
వాస్తవానికి నిత్యత్వములో ఆయన స్థితి
దేవునితో సమానముగా
పరలోకములో ధనవంతునిగా వున్నాడు
దేవుని స్వరూపం కలిగినవాడు
ఆయన అన్నిటికంటే ముందుగా వున్నవాడు
ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు
ఇలాంటి స్థితిలో వున్న ఆయన దరిద్రుడయ్యాడు
ఆయన వంశము రాజవంశమే
గాని ఆయన జన్మ రాజ మందిరములో జరగలేదు
సత్రములో కూడా ఆయనకు స్థలము లేదు
ఒక సాధారణమైన జీవితం జీవించాడు
ఒక సేవకునిగా పరిచారకునిగా వున్నాడు
ఆయన దరిద్రత వలన మనకు ఏం లభించింది ?
మనము ధనవంతులము అయ్యాము
ఆయన దరిద్రత మనకు ఐశ్వర్యము
ప్రపంచం సంపదను డబ్బు బంగారముతో కొలుస్తుంది
లోకం కొలిచినట్టు దేవుడు కొలవడు
ఈరోజు క్రీస్తును మన జీవితములో కలిగి వుండడమే నిజమైన సంపద ఫిలిప్పీ3:7-8
క్రీస్తును కలిగిన క్రైస్తవులు ఐశ్వర్యవంతులు భాగ్యవంతులు
1కొరింథి1:5-6
యాకోబు2:5
B.పాపమాయెను
------------------------------
2కొరింథి5:21
వాస్తవానికి ఆయన పాపము చేయలేదు
పాపము ఎరుగనివాడు
పరిశుద్ధుడు పవిత్రుడు
హెబ్రీ4:15,7:26
1పేతురు2:22
పాపమెరుగని ఆయన మనకోసము పాపమాయెను
అంటే పాపశిక్ష మన కొరకు భరించాడు
రోమా8:3-4
దేవుడు మన పాపమునకు ఆయన శరీరమందు శిక్ష విధించెను
మన పాప ఋణము మనము తీర్చలేము
మన కొరకు ప్రభువు ఆ ఋణమును చెల్లించాడు
C.వ్యాధిగ్రస్తుడాయెను
------------------------------
యెషయా53:3,10
ఆయన గాయపరచబడెను
ఎందుకు ఆయన గాయపరచబడ్డాడు
మన పాపములు కొరకు
మన దోషములును బట్టి
మనలను సమాధానపరచుటకు
మనకు స్వస్థత కలుగజేయుటకు
యెషయా53:5
ఆయన గాయములు వలన మనకు స్వస్థత
1పేతురు2:24
ఈస్వస్థత శరీరానికి సంబంధించినది కాదు
ఇది హృదయపు స్వస్థత
యిర్మీయా17:9
హృదయపు వ్యాధి ఎలా వుంటుంది ?
మార్కు7:21-22
క్రీస్తు రక్తము హృదయము మీద ప్రోక్షణ జరిగింది
హృదయము కడగబడింది
హెబ్రీ10:22 1పేతురు1:1-2
ఆయన గాయములు వలన మన పాపములకు స్వస్థత కలిగింది
D.శాపమాయెను
------------------------------
గలతి3:13-14
క్రీస్తు ద్వారా అన్యజనులను ఆశీర్వదించుటకు దేవుడు ఆయనను శాపముగా చేసెను
ద్వితీ21:23
ప్రభువు చేసిన త్యాగానికి మన స్పందన ఎలా వుంటుంది ?
గలతి2:20
ప్రభువు కొరకే జీవిస్తాము
ఆయన కొరకే బ్రదికి ఆయన కొరకే చనిపోతాము
క్రీస్తు సంఘము
దామరచర్ల-మిర్యాలగూడ
ప్రభువుపనిలో మీసహోదరులు
N.జయరాజు🙏