Перейти к содержимому

4 Types Pre Masala Powders🤗 |నా Easy Day Cooking కోసం| Instant Pot లో Ghee preparation | Happyhome❤️

Alaa_Aarna tho😘

0:00 / 0:00

4 Types Pre Masala Powders🤗 |నా Easy Day Cooking కోసం| Instant Pot లో Ghee preparation | Happyhome❤️

22 662 просмотра · 2 месяца назад
Alaa_Aarna tho😘
108 тыс. подписчиков
22 662 просмотра · 2 месяца назад
రసం పొడి (Rasam Powder) : కావలసినవి: పచ్చి శనగపప్పు: 5 స్పూన్ లుకందిపప్పు: 1 స్పూన్లు (లేదా ఎర్ర కందిపప్పు 2 స్పూన్) మినపప్పు: ½ స్పూన్ జీలకర్ర: 2 స్పూన్ లుమిరియాలు: 2 స్పూన్ లుధనియాలు: 1 స్పూన్ ఎండుమిర్చి: 6 లేదా 7 ఇంగువ: కొద్దిగా (నచ్చితే) వెల్లుల్లి రెబ్బలు: 4తయారీ విధానం: పప్పులు వేయించడం: లో ఫ్లేమ్‌లో పచ్చి శనగపప్పు, కందిపప్పు, మినపప్పులను దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. మసాలాలు వేయించడం: జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి కూడా బాగా వేయించి, అన్నిటినీ చల్లారనివ్వాలి. గ్రైండింగ్: అన్నీ చల్లారాక మిక్సీ జార్‌లో వేసి, కొంచెం ఇంగువ చేర్చి మెత్తగా గ్రైండ్ చేయండి. ముగింపు: చివరగా 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పడితే.. ఒక నెల రోజులకు సరిపోయే గుమగుమలాడే రసం పొడి రెడీ🤗 కొబ్బరి కారం (Kobbari Karam): కావలసినవి: ఎండుమిర్చి: 100 గ్రాములు (లేదా కారానికి తగినన్ని) / లేదా వీటికి బదులు ఎర్ర కారం పొడి అయినా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ముక్కలు/తురుము: 150 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు: 8 ఉప్పు: సరిపడినంత తయారీ విధానం:పైన చెప్పిన పదార్థాలన్నింటినీ మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి కారం రెడీ🤗 ఎలా వాడుకోవాలి? (ఉపయోగాలు)::👇🏻👇🏻 ఫ్రై కూరలు: బెండకాయ, దొండకాయ, కాకరకాయ, metikkayala fry ,పొటాటో ఫ్రై, తోటకూర ఫ్రై మరియు పాలకూర ఫ్రైలలో ఈ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్ పోపు: కూర చేసే టైం లేనప్పుడు, ఆనియన్ పోపు (ఉల్లిపాయ ముక్కల తిరగమోత) పెట్టి, ఉల్లిపాయలు వేగాక ఈ కారం వేసి కలిపి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. ఇన్‌స్టంట్ రైస్: అసలు ఆ టైం కూడా లేనప్పుడు, వేడి వేడి అన్నంలో ఈ కారం డైరెక్ట్‌గా వేసుకుని, కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది అబ్బా 😋👌 పుట్నాల పొడి లేదా పప్పుల పొడి (Putnala/Pappula Podi): కావలసినవి: పుట్నాల పప్పు (వేపిన శనగపప్పు): 200 గ్రాములు కొబ్బరి పొడి: 4 స్పూన్ వెల్లుల్లి రెబ్బలు: 8 కారం: 2 స్పూన్ లుఉప్పు: సరిపడినంత తయారీ విధానం:పైన చెప్పిన పదార్థాలన్నీ మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేయాలి. అయితే మరీ గంధం లాగా మెత్తగా చేయవద్దు (అలా చేస్తే నోటికి చుట్టుకుపోతుంది), కొంచెం పలకగా ఉండేలా పౌడర్ చేసుకుంటే కారం రెడీ🤗 ఎలా వాడుకోవాలి? (ఉపయోగాలు): టిఫిన్స్: ఇడ్లీ, దోశల పైన చల్లుకోవడానికి ఈ కారం అద్భుతంగా ఉంటుంది. ఉప్మా & ఉగ్గాని: ఉప్మా మరియు ఉగ్గాని, బజ్జీ (లల్లాకి) కాంబినేషన్లలో దీనిని వాడుకోవచ్చు. ఫ్రై కూరలు: వంకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రైలలో ఈ పొడి వేసుకుంటే రుచి 👌👌👌 అబ్బా😋 ఈ రెండు పొడులు (కొబ్బరి కారం & పుట్నాల పొడి) కలిపి చేసుకునే ఫ్రై కూరలు: కొబ్బరి కారం, పుట్నాల పొడి.. ఈ రెండింటినీ కలిపి వాడుకుంటే కింద పేర్కొన్న ఫ్రై కూరల రుచి అద్భుతంగా ఉంటుంది: చిక్కుడుకాయ రబీన్స్ గోరుచిక్కుడుకాయ (మెటిక్కాయలు) వంకాయ గుత్తివంకాయ కారం (గుత్తివంకాయలో ఈ పొడుల కాంబినేషన్ మసాలా సూపర్) కాకరకాయ ఫ్రై 👌👌👌👌 గ్రేవీ కూరల కోసం డ్రై మసాలా (Dry Masala for Gravy Curries): కావలసినవి: ధనియాలు: 120 గ్రాములు ఎండు కొబ్బరి: 100 గ్రాములు వెల్లుల్లి పాయలు: 6 గడ్డలు జీలకర్ర: 1 స్పూన్ల లవంగాలు: 6 చెక్క: 2 ఇంచులు గసగసాలు: 1 స్పూన్ (కావాలనుకుంటేనే) తయారీ విధానం: ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు.. మరియు కావాలనుకుంటే 1 స్పూన్ గసగసాలు కూడా వేసి పాన్‌లో లైట్‌గా వేయించుకోవాలి.వేయించిన వాటిని కొబ్బరి మరియు వెల్లుల్లిపాయలతో కలిపి మిక్సీ పడితే.. కమ్మటి డ్రై మసాలా రెడీ🤗 ఎలా వాడుకోవాలి? (కుకింగ్ టిప్స్): అన్ని రకాల గ్రేవీలు: ఇది అన్ని రకాల గ్రేవీ కూరల్లోకి సూపర్ మసాలా. గ్రేవీ కూరలు చేసుకునేటప్పుడు అల్లం కూడా దంచి వేసుకోండి. మసాలా వేసే టైమింగ్: కూర 80% ఉడికిన తర్వాత ఈ మసాలా వేసి కలిపి, మిగతా 20% ఉడికించుకోవాలి. ఫ్రై కూరలు: గ్రేవీలకే కాదు.. క్యాబేజీ ఫ్రై, కాలీఫ్లవర్ ఫ్రై, పొటాటో ఫ్రైలలో కూడా ఈ మసాలా బెస్ట్ కాంబినేషన్, ట్రై చేయండి అబ్బా👌😋 ఇన్‌స్టంట్ పాట్‌లో నెయ్యి తయారీ (Instant Pot Ghee Prep)విధానం: ఇన్‌స్టంట్ పాట్ ఆన్ చేసి సాటే మోడ్ (Saute Mode) పెట్టాలి. తయారీ: మీకు కావలసినంత బటర్ (వెన్న) వేసి, అడుగంటకుండా కలుపుకుంటూ నెయ్యి కాచుకోవడమే. ముఖ్యమైన టిప్: ఈ ప్రాసెస్ చాలా స్పీడ్‌గా అయిపోతుంది. కాబట్టి దగ్గరుండి చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి🤗 #viral #weekly #mealprep #mealplanning #mealprepideas #simple #simplerecipe #mealprepplanning #mealplanning #indianmeal #mealplan #food #cooking #protein #instantrecipe #simplecooking #semimealprep #paneer #chana #protein #mealplanning #weekly #healthybreakfast #breakfastrecipe #instantrecipe # #foodstorage #healthyrecipes #Healthysnackoptions #snacksforkids #lunchbox #kidssnacksrecipes #easymealprep #healthymealprep #masala #drymasala #kobbarikaram #pappulapodi #putnalapodi #rasam #rasampowder #rasampowderrecipe #instantpotrecipes #ghee