దసరా నవరాత్రి 5వ రోజు లలితా దేవి హారతి | Sri Lalitha Devi Harathi | Navratri Special Song 2026
Sanatana Dhvani
0:00 / 0:00
దసరా నవరాత్రి 5వ రోజు లలితా దేవి హారతి | Sri Lalitha Devi Harathi | Navratri Special Song 2026
4 682 просмотра · 1 день назад
Sanatana Dhvani
241 тыс. подписчиков
4 682 просмотра · 1 день назад
శ్రీ చక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత
పసిడి పాదాలకిదె నీరాజనం
పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశి
ఆ సింహమధ్యకు రత్న నీరాజనం
రత్న నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
బంగారు హారాల సింగారమొలికించు
అంబికా హృదయకు నీరాజనం
శ్రీ గౌరి శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి
శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
కల్పతరువై మమ్ము కాపాడు కరములకు
కనకంబు కాసులతో నీరాజనం
పాశాంకుశ పుష్ప బాణ చాపాధరికి
పరమ పావనమైన నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే
కల్యాణ సూత్రముకు నీరాజనం
కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు
కాత్యాయనికి నిత్య నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన
శతకోటి నక్షత్ర నీరాజనం
కలువ రేకులవంటి కన్నుల తల్లిశ్రీ
రాజరాజేశ్వరికి నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
ముదమార మోమున ముచ్చటగా ధరియించు
కస్తూరి కుంకుమకు నీరాజనం
చంద్రవంకను శిరోమకుటముగ దాల్చు
సౌందర్యలహరికిదె నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
శుక్రవారమునాడు శుభములొసగే తల్లి
శ్రీ మహాలక్ష్మికిదె నీరాజనం
శృంగేరి పీఠమున సుందరాకారిణి
శారదా మాయికిదె నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మ
ముత్యాలతో నిత్య నీరాజనం
జన్మ జన్మల తల్లి జగదీశ్వరీ నీకు
భక్త జనులిచ్చేటి నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు
తల్లి గాయత్రికిదే నీరాజనం
ఆత్మార్పణతో నిత్య నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
#LalithaTripuraSundari #DasaraNavratri #NavratriDay5 #LalithaDeviHarathi #TeluguDevotional #NavratriSpecial #Dussehra #BhaktiSongs
Welcome to Sanatana Dhvani, we create videos of gods in AI, Discover the power of ancient Indian music, chants, and spiritual teachings. This channel offers peaceful sounds and wisdom to help you connect with your inner self and the divine. Join us on this spiritual journey!
#sanatanam #sanatana #hindu