నెల రోజులైనా నిల్వ ఉంటుంది......#tamatorecipe#tamarind#garlic#telugu videos
@HR Videos 1985 Subscribe
0:00 / 0:00
నెల రోజులైనా నిల్వ ఉంటుంది......#tamatorecipe#tamarind#garlic#telugu videos
45 просмотров · 2 недели назад
@HR Videos 1985 Subscribe
151 подписчик
45 просмотров · 2 недели назад
please do like 👍 🙏 share & subscribe
comment about my content
🔗
పదార్థాలు..
ఒక కేజీ నాటు ఎర్రని టమాటాలు 🍅 ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
1) పోపు కోసం
ఒక చెంచా పసుపు
ఎండుమిర్చి
100 గ్రాముల వెల్లుల్లి పాయలు
గుప్పెడు కరివేపాకు
ఒక కప్పు పల్లి నూనె
రెండు చెంచాల పోపు దినుసులు
రెండు చెంచాల పచ్చి సెనగపప్పు
ఒక చెంచా ఛాయా మినప్పప్పు
2).కారం పొడి కోసం
ఒక చెంచా ఆవాలు
ఒక చెంచా జీలకర్ర
ఒక కప్పు ఉప్పు
ఒక కప్పు పచ్చడి కారం పొడి
50 గ్రాముల చింతపండు చక్కగా నార తీసి ఉంచుకోవాలి.
టమాటా నిల్వ పచ్చడి తయారీ విధానం 🤔 🤔
ముందుగా వేడెక్కిన గిన్నెలో ఆవాలు వేసి చిటపటలాడాక జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి.
చల్లారాక మిక్సీ పట్టుకొని అందులోనే చింతపండు, ఉప్పు, కారం వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి.
మరో గిన్నెలో టమాటాలను వేసుకొని ఉడికించుకోవాలి.
టమాటాలు ఉడుకుతున్నప్పుడే కొంచెం పసుపు వేసి ముందు ఉడికించుకోవాలి.
చిన్న మంట మీదనే టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు పోపు కోసము వేడెక్కిన గిన్నెలో నూనె వేసి నూనె వేడయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి అలాగే పచ్చి శనగపప్పు చాయ మినప్పప్పు వెల్లుల్లిపాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి.
కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి లేకపోతే పచ్చడి పాడవుతుంది.
ఇవన్నీ వేగాక ముందుగా ఉడికించుకున్న టమాటా ని కూడా వేసుకొని నూనె పైకి తేలేంతవరకు చిన్న మంట మీద మెల్లగా కలుపుతూ ఉడికించుకోవాలి.
కొందరు టమాటా అని పేస్ట్ కూడా చేస్తారు నేను చేయలేదు నాకు ఇలాగే బాగుంటుంది.
ఉడికిన మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారప్పొడి మిశ్రమాన్ని వేసి మంచిగా కలుపుకోవాలి.
చల్లారకముందే వేస్తే కారంపొడి నల్లగా అయిపోతుంది.
ఒక ఎనిమిది గంటలు ఊరనిస్తే మనకి ఫ్రిడ్జ్ తో పని లేకుండా నెల రోజులైనా నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి తయారవుతుంది.
ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కానీ దోశ లోకి కానీ చాలా బాగుంటుంది.😋😋