Townsville Bathukamma Celebrations టౌన్స్విల్ తెలుగు బతుకమ్మ సంబరాలు 2023
Narayana Attam
0:00 / 0:00
Townsville Bathukamma Celebrations టౌన్స్విల్ తెలుగు బతుకమ్మ సంబరాలు 2023
99 просмотров · 3 г. назад
Narayana Attam
6 подписчиков
99 просмотров · 3 г. назад
టౌన్స్ విల్ తెలుగు కమ్యూనిటీ బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతో ఘణంగా జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం సద్దులబతుకమ్మ వేడుకలకి టౌన్స్ విల్ మేయర్ శ్రీ జెన్నీ హిల్ ముఖ్యఅతిథి గా విచ్చేయటమే కాకుండ ఎంతో ఆనందంగా పాల్గొని వచ్చిన అతిథులందరిలో ఉత్సాహాన్ని నింపి మన భారత సంప్రదాయాల్ని ఎంతగానో కొనియాడారు మేయర్ జెన్నీ హిల్ మాట్లాడుతూ తను భారతీయ వేడుకల్లో పాలుగొన్న ప్రతి సందర్భంలో ఎంతో నేర్చుకుంటున్నాను అని మరీ ముఖ్యంగా ఈరోజు బతుకమ్మ ప్రాముఖ్యత, మన స్త్రీ దేవతామూర్తులు తమ వస్త్రధారణ తో స్వాగతించిన విధానం మరియు మన అతిథి మర్యాదలు తనని ఎంతో మంత్రముగ్దురాలని చేశాయని తెలియచేసారు. టౌన్స్బ విల్ తెలుగు కమ్యూనిటీ బతుకమ్మ సంబరాలకు తనని ఆహ్వానించినందుకు ఎంతో సంతోషాన్ని తెలియచేస్తూ విభిన్న సంస్కృతులు టౌన్స్ విల్ యొక్క అభ్యున్నతికి ఎంతగానో దోహద పరుస్తున్నాయని మరీ ముఖ్యంగా భారతీయ సంస్కృతి ఎంతో అత్యున్నతమయినదిగా కొనియాడారు.
స్వయంగా తానూ విభిన్న సంస్కృతులకు చెందిన కుటుంబం నుండి వచ్చానని, మన ఉనికికి ఆధారమయిన సంస్కృతులను కాపాడుకోవటం ఎంతో ముఖ్యమని, భారతీయ సంస్కృతిని తమ తరువాతి తరాలకు తెలియచేసందుకు కృషి చేస్తున్న టౌన్స్ విల్ లో ఉన్న భారతీయులందరికి తన సంఘీభావాన్ని తెలియచేసారు. భారతీయ సంస్కృతీ వేడుకలు టౌన్స్ని విల్ర్వ లో హించుటకు టౌన్స్ విల్ సిటీ కౌన్సిల్ అన్ని విధాలుగా సహకరిస్తుంది అని ఈ సహకారం ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అని తెలియచేస్తూ, ఎంతో ఆర్భాటంగా బతుకమ్మ సంబరాలు నిర్వచిన తెలుగు కమ్యూనిటీ నిర్వాహకులకు కృతఙ్ఞతలు తెలియచేసారు.
ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా మన తెలుగు ఆడపడుచు సౌమ్య గారు ఎంతో శ్రమకోర్చి చంటి పిల్లాడితో టౌన్స్ విల్ కి ఎనిమిది గంటలు ప్రయాణించడమే కాకుండా , అంత దూరం నుండి బతుకమ్మని పేర్చుకొని వచ్చి తోటి తెలుగు వారితో బతుకమ్మ సంబరాలు జరుపుకోవటం ఎంతో అభినందించ గల విశేషం. ఇంకొక విశేషం ఏంటంటే సౌమ్యగారు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్న ఇంకో బతుకమ్మని తయారు చేసుకొని తెచ్చారు, బోబి డాల్ కి చీర కట్టి నెత్తిన బతుకమ్మని ఎత్తుకొన్న ఆ బొమ్మ బతుకమ్మ చూడటానికి ఎంతో ముద్దు గా ఉండటం విశేషం.
ప్రతి సంవత్సరం మాదిరిగానే టౌన్స్ విల్ రీజియన్ లో ఉండే భారతీయులే కాకుండా, చుట్టు పక్కల ప్రాంతాలనుండి కూడా కొన్ని గంటల ప్రయాణాన్ని లెక్క చేయకుండా బతుకమ్మ వేకుడకకి విచ్చేసి ఆడిపాడి ఎంతో ఆనందాన్ని పొందారు, ప్రతిసంవత్సరం తాము బతుకమ్మ వేకుడకోసం ఎదురుచూస్తుంటాముఅని వారి ఆనందాన్ని నిర్వాహకులతో పంచుకున్నారు.
నిక్ (నారాయణ ) అట్టం బతుకమ్మ ప్రాముఖ్యతని వేడుకకి విచ్చేసిన అతిథులకు వివరించి, అక్కడికి వచ్చిన తన సోదరీమణుల తరపున తన అనుభవాలను అనుభూతులను అతిథులతో పంచుకున్నారు.
బతుకమ్మ స్త్రీ ప్రాముఖ్యత గల పండుగ అని, అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది విధాలుగా బతుకమ్మ రూపంలో కొలుస్తూ, ఒక్కొరోజుకి ఒక్కో ప్రాముఖ్యత ఉన్నదని మొదటి రోజు ఎంగిలిపువ్వు తో మొదలుకొని తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మ తో ముగుస్తుంది అని పండుగ ప్రాముఖ్యతను తెలియచేసారు. మరీ ముఖ్యముగా మనం ప్రతి పూజకి దేవత మూర్తులని పువ్వలుతొ పూజిస్తామని, పువ్వునే దేవతగా కొలిచె ఏకైక పండుగ బతుకమ్మ అని కొనియాడారు.
నిర్వాహకులు రాఘవ గారు క్రితం సంవత్సరం కంటే ఎత్తుగా బతుకమ్మని పేర్చుకొని వచ్చి తన కళా నైపుణ్యం తోటి భారతీయులతో పంచుకున్నారు, రాఘవగారు మాట్లాడుతూ ఇంత పెద్ద బతుకమ్మ పేర్చటం వెనుక ఉన్న విశిష్టతని తెలియచేస్తూ తనకి కూతురు పుడితే ప్రతి బతుకమ్మ పండక్కి కూతురికంటే ఎత్తు బతకమ్మని చేస్తాను అని అమ్మవారికి మొక్కుకున్నాను అని అదే విధంగా ప్రతి సంవత్సరం తన మొక్కూ తీర్చుకుంటున్నాను అని తెలియచేసారు. విశిష్ట అతిథి మేయర్ జెన్నీ హిల్ రాఘవగారిని అంత పెద్ద బతుకమ్మ పేర్చుటకు సామాగ్రి ని ఎక్కడి నుండి సమకూరుస్తారు అని ఆరా తీయగా, తాను భారతదేశం నుండి దిగుమతి చేసుకుంటాను అని ఇలా బతుకమ్మను పేర్చటం తనకు ఎంతో సంతృప్తిని కలుగచేస్తుంది అని అలాగే తన కూతురికి, సతీమణి శ్రీమతి రూప కి బతుకమ్మ ఎంతో ప్రత్యేకమని తెలియచేసారు.
వెంకటేశ్వర్ రావు గారు విశిష్ట అతిధి గా విచ్చేసిన మేయర్ జెన్నీ హిల్ గారికి, బతుకమ్మ వేడుకలో పాల్గొనడానికి సుదూర ప్రాంతాలనుండి`విచ్చేసిన తెలుగు వారికి మరియు స్థానికంగా నివసిస్తూ వేడుకకి విచ్చేసిన తమిళ, మలయాళ , కన్నడ మరియు ఉత్తర భారతీయులకు కృతఙ్ఞతలు తెలియచేస్తూ. ఈ వేడుక ఇంత ఘణంగా నిర్వహించేందుకు సహకరించిన తోటి తెలుగు వారందరికీ పేరు పేరు న కృతజ్ఞతలు తెలియచేస్తూ మరీ ముఖ్యంగా ఎంతో శ్రమకోర్చి ఇష్టంగా బతుకమ్మని పేర్చుకొనిరావటమే కాక కమ్మటి విందు భోజనం వండి తెచ్చి అందరితో తమ ఆనందాన్ని పంచుకున్న తెలుగు ఆడపడుచులకు వచ్చిన అతిథులతో పాటు నిర్వాహకుల తరపున పేరు పేరు న కృతఙ్ఞతలు తెలియచేసారు.
ఈ సంవత్సరం బతుకమ్మ వేడుకలు నానమ్మలు, తాతలు తమ మనుమలు మనుమరాళ్ళతో టౌన్స్ విల్ లో జరుపుకోవటం తమకి ఎప్పటికి మధురస్మృతిగా ఉండిపోతుంది అని, వేడుకలు నిర్వహించిన తెలుగు వారికి వారి కుటుంబాలకు ఆశీసులు అందించి ఆనందించారు.
#townsvilleshines #Townsvillebathukamma #TownsvilleTelugu #telugu #bathukamma #Australiabathukamma #australia #NRIBathukamma #tv9telugu #tv9teluguusa #v6news #v6telugunews #hindu #hindufestivals #telangananews