Перейти к содержимому

Irandam Thiruvandadi51,52🙏ఇరణ్డామ్ తిరువందాది 51,52 పాశురములు

Padmaja Ramanujadasi

0:00 / 0:00

Irandam Thiruvandadi51,52🙏ఇరణ్డామ్ తిరువందాది 51,52 పాశురములు

2 983 просмотра · Трансляция закончилась 11 дней назад
Padmaja Ramanujadasi
57,6 тыс. подписчиков
2 983 просмотра · Трансляция закончилась 11 дней назад
నేటి ప్రశ్నలు: ఇరణ్డామ్ తిరువందాది 51,52 పాశురములు 01 : తెల్ల సముద్రాన్ని చిలికే నల్ల సముద్రం ఏమిటి ? సమాధానము : సువిశాలమైన తెల్లని పాల సముద్రాన్ని చిలికే నల్లని సముద్రం శేష శయనుడైన శ్రీమన్నారాయణుడు. 02 : నేటి 51వ పాశురపరంగా భగవంతుని నామం చెప్పాలి !? సమాధానము : నేటి 51వ పాశురపరంగా శ్రమహరమైన భగవంతుని నామాన్ని మనస్సుకు వంటబట్టే విధంగా, దేవతల వలె ప్రయోజనాంతర పరులు కాకుండా, ఆ స్వామిని ఆపాదమస్తక పర్యంతం తలచుకుంటూ చెప్పకుండా ఉండ లేక చెప్పుతున్నట్లు చెప్పాలి. 03 : "అఱమ్" అనుట ద్వారా ఏ ధర్మాన్ని చెప్పారు? సమాధానము : "అఱమ్" అనుట ద్వారా ఆనృఙశంస్య ధర్మాన్ని గూర్చి చెప్పారు. ఆనృశంస్య ధర్మమంటే ఇతరుల దుఃఖాన్ని చూసి తట్టుకోలేక దుఃఖించే గుణం. 04 : "నెఱి" అంటే రెండు నిర్వాహాలు వ్రాయండి. సమాధానము : " నెఱి " అంటే రెండు నిర్వాహాలు చెప్తారు. ౦౧ : తన భక్తుడే ఐనా ఇంద్రుని పదవీభ్రష్టుని చేసి పీడిస్తున్న మహాబలిని ఆతనిలో ఉన్న ఔదార్య గుణమునకు ముచ్చటపడి ఒక మన్వంతరం పాటు పాతాళలోకానికి అధిపతిని చేసి, చిరంజీవిగా చేసిన గొప్ప ఔదార్య గుణము కలిగిన స్వామి శ్రీమన్నారాయణుడు. ౦౨ : అనంత కృపావిశేషయైన శ్రీమహాలక్ష్మిని తన వక్షఃస్థలమున ధరించి యున్న స్వామి శ్రీమన్నారాయణుడు. #irandam_thiruvandadi #pasuram51 #pasuram52 #pudattazhwar #bhuta_yogi #srirangam #thirumala #6years_of_ynv_goshti #yathirajanadhavalli_goshti #padmajaramanujadasi #acharya_vaibhavam #ramanuja_vaibhavam #bhagavad_ramanuja #thirunakshatram #divyadesalu #samasrayanalu #vaishnava_sampradayam #srivaishnavism #bhagavadvishayam #alwar #azhwar #andal #goda #krishna 51) మదిక్కణ్డాయ్ నెఞ్జే । మణివణ్ణన్ పాదమ్ । మదిక్కణ్డాయ్ । మற்று అవన్ పేర్ తన్నై । మదిక్కణ్డాయ్ పేరాழிనిన్ఱు । పెయర్ న్దు కడల్ కడైన్ద ౹ నీర్ ఆழி వణ్ణన్ । నిఱమ్ ॥ 2232 ప్రతిపదార్థములు : నెంజే = ఓ మనసా ; మణివణ్ణన్ పాదం మదిక్కండాయ్ = నీలమణి కాంతి గలిగిన వాని పాదములను తలచుచుండుము ; మற்று అవన్ పేర్ తన్నై మదిక్కండాయ్ = మఱియు అతని దివ్య నామముల తలచు చుండుము ; పేరాழி నిన్ఱు పెయర్ న్దు = మహా సముద్రమున నిలిచిన ; కడల్ కడైంద = ఆ కడలిని చిలికిన ; నీర్ ఆழி వణ్ణన్ నిఱం = కడలి వర్ణము కలిగిన వానిని ; మదిక్కండాయ్ = తలచుకొనుము. భావమ్ : నా మనసా ! నీలమణి సదృశుడగు శ్రియఃపతి పాదములని తలచుము. ఆస్వామి దివ్యనామముల స్మరింపుము. పాల కడలిపై యున్న స్వామి, దేవతలకై సముద్రమును చిలికెను. ఆ కడలి వర్ణశోభితుడగు శ్రీహరిని ధ్యానింపుము. 52) నిఱమ్ కరియన్ శెయ్య । నెడు మలరాళ్ మార్వన్ । అఱమ్ పెరియన్ ౹ ఆర్ అదు అఱివార్ ౹ మఱమ్ పురిన్ద వాళ్ అరక్కన్ పోల్వానై । వానవర్ కోన్ తానత్తు నీళ్ ఇరుక్కైక్కు । ఉయ్ త్తాన్ నెఱి ॥ 2233 ప్రతిపదార్థములు : నిఱం కరియన్ = నల్లనివాడు ; శెయ్య నెడు మలరాళ్ మార్బన్ = కెంపు గలిగి తామర పుష్పమున వసించు లక్ష్మీదేవిని ఉరమున కలిగిన వాడు ; అఱం పెరియన్ = ప్రసన్న గుణ గంభీరుడు, మఱం పురింద = పగబూనిన ; వాళ్ అరక్కన్ = చేత కత్తిని పూనిన రాక్షసుని ; పోల్ వానై = పోలిన వానిని [ బలిని ] ; వాన్ వర్ కోన్ దానత్తు = దేవేంద్రుని స్థానమున ; నీళ్ ఇరుక్కైక్కు = దీర్ఘ కాల ముండుటకై ; ఉయ్ త్తాన్ = పంపి వేసెను ; నెఱి అదు = ఈ గొప్ప ఉక్తితో కూడిన దానిని ; ఆర్ అఱివార్ = ఎవరు గ్రహింపగలరు. భావమ్ : కారు మబ్బు రంగు కలిగిన స్వామి, కెందామర ఛాయ గల పద్మ వాసిని, లక్ష్మీదేవిని తన ఉరమున ధరించి యున్నాడు. అశేష కృపా కటాక్షము కలిగిన వాడు. శత్రుత్వముతో కరవాలము చేతబూనిన రావణుని వలె నున్న మహా బలి చక్రవర్తిని దీర్ఘకాలము పాతాళ లోకమున రాబోవు దేవేంద్ర సుఖముల ననుభవించుటకై పంపించిన సంకల్పార్థ మెవరి కవగత మగును ? పూదత్తాழ்వార్ తిరువడిగళే శరణమ్ ఆழ்వార్, ఎమ్బెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణమ్ ━❀꧁꧂❀┅ ధరణి ┅❀꧁꧂❀━ ONLINE CLASSES Daily from 3.30pm to 5pm FCC (Free Conference Call) LINK: https://join.freeconferencecall.com/p... TELEGRAM LINK: https://t.me/joinchat/LyoBXhelW-PjquD... YOUTUBE LINK:    / @padmajaramanujadasi   WEBSITE ADDRESS: https://padmajaramanujadasi.com/te/ WHATSAPP CHANNEL LINK: https://whatsapp.com/channel/0029Va6S... INSTAGRAM LINK https://www.instagram.com/padmaja_ram... FACEBOOK LINK   / 1evsdq7rau   అడియేన్ రామానుజదాసి🙏