Перейти к содержимому

Irandam Thiruvandadi60🙏ఇరణ్డామ్ తిరువందాది 60వ పాశురము

Padmaja Ramanujadasi

0:00 / 0:00

Irandam Thiruvandadi60🙏ఇరణ్డామ్ తిరువందాది 60వ పాశురము

1 955 просмотров · Трансляция закончилась 4 дня назад
Padmaja Ramanujadasi
57,6 тыс. подписчиков
1 955 просмотров · Трансляция закончилась 4 дня назад
నేటి ప్రశ్నలు: ఇరణ్డామ్ తిరువందాది 60 వ పాశురము 01 : "ఉరువం" అంటే ఏమిటి? నేటి 60వ పాశురంలో ఈ పదం ఎన్నిసార్లు వచ్చింది? సమాధానము : ఉరువం అంటే "భగవత్స్వరూపమ్." నేటి 60 వ పాశురంలో ఈ పదం ఐదు సార్లు వచ్చింది. 02 : భగవంతుని స్వరూపం ఎటువంటిది? రెండు నిర్వాహాలు వ్రాయండి. సమాధానము : భగవంతుని స్వరూపం సాటిలేని స్వయంప్రకాశకమ్. భగవంతుని స్వరూపాన్ని లోకులు రెండు విధములుగా చెబుతారు. నిరంకుశ స్వాతంత్య్రమ్ మరియు ఆశ్రిత పారతంత్ర్యమ్... కానీ, స్వామి పెరియవాచ్చాన్ పిళ్ళై గారి నిర్వాహం ప్రకారం పరమాత్మ నిరంకుశ స్వాతంత్య్రమ్ కలిగి ఉన్నప్పటికీ, దాసుల పట్ల అది తలొగ్గి ఆశ్రిత పారతంత్ర్యమ్ స్థిరంగా ఉంటుంది. స్వామి అప్పిళ్ళై నిర్వాహం ప్రకారం పరవాసుదేవుని రూపం కన్నా అవతారరూపమే చేతనోజ్జీవన కారణమైనందున అవతారరూపమే స్థిరమైనది. వెరసి భగవత్ స్వరూపం రెండు విధాలుగా కాక ఏకస్వరూపం అని రెండు నిర్వాహాల ద్వారా తెలుస్తుంది. 03 : మనలను ఎల్లవేళలా రక్షించేది ఎవరు? సమాధానము : భగవంతుని స్వరూపాన్ని (ఆశ్రిత పారతంత్ర్యాన్ని) లోకులకు తెలియ చెప్పి, స్వామి పట్ల అభినివేశాన్ని పొందేటట్లు చేసి, సంస్కరించి, గొప్ప ధర్మాన్ని అనుష్ఠించే వారే మనలను ఎల్లవేళలా రక్షించేవారు. 04 : పై విషయాన్ని తెలిపే పాశురపదమేది? సమాధానము : పై విషయాన్ని తెలిపే పాశురపదం "నీదియాల్ మణ్ కాప్పార్ నిన్ఱు" #irandam_thiruvandadi #pasuram60 #pudattazhwar #bhuta_yogi #srirangam #thirumala #6years_of_ynv_goshti #yathirajanadhavalli_goshti #padmajaramanujadasi #acharya_vaibhavam #ramanuja_vaibhavam #bhagavad_ramanuja #thirunakshatram #divyadesalu #samasrayanalu #vaishnava_sampradayam #srivaishnavism #bhagavadvishayam #alwar #azhwar #andal #goda #krishna 🙏శ్రీమతే రామానుజాయ నమః🙏 🪷 పూదత్తాழ்వార్ విరచిత 🪷 ॥ ఇయఱ్పా - ఇరణ్డాన్ తిరువన్దాది ॥ ౬౦ వ పాశురము : 60) ఓరురువనల్లై । ఒళి ఉరువం నిన్నురువమ్ । ఈరువరువనెన్బర్ । ఇరునిలత్తోర్ । ఓరురువమ్ ఆదియాం వణ్ణం । అఱిన్దార్ అవర్కణ్డీర్ । నీదియాల్ మణ్ కాప్పార్ । నిన్ఱు ॥ 2241 ప్రతిపదార్థములు : ఓర్ ఉరువన్ అల్లె = ఒకే రూపమున కాదు ; నిన్ ఉరువమ్ ఒళి ఉరువమ్ = నీ రూపము జ్యోతి స్వరూపమైనది ; ఇరు నిలత్తోర్ = ఈ భూ ప్రజలు ; ఈర్ ఉరువన్ ఎన్బర్ = రెండు స్వరూపములతో కూడిన వాడని అందురు ; ఓర్ ఉరువమ్ ఆదియామ్ వణ్ణమ్ = ఒక స్వరూపమన్నింటికి ఆదిగ నుండును ; నీది యాల్ = వేద ప్రమాణ నియతిచే ; అఱిన్దార్ అవర్ = తెలిసికొనిన వేద విదులు ; నిన్ఱు మణ్ కాప్పార్ = ఈ భూమిని రక్షించుచుందురు. ఈర్ = అనగా రెండు, పెద్దది అని అర్థములున్నవి. రెండు రూపములకు విభిన్న భావాన్వయములతో వ్యాఖ్యానములున్నవి. భావమ్ : సర్వమయుడగు పరమాత్మ ఏక స్వరూప సమన్వితుడు కాడు. స్వప్రకాశముతో కూడిన తేజ స్స్వరూపమున రెండవ మూర్తిగ సకల చరాచర చేతనములకు ఆది సృష్టిగ దీపించుచున్నాడని వేదవిదుల సత్యవాక్కు. అదియే జీవ ప్రకృతిని సంరక్షించుచున్నది. నిత్యానపాయిని లక్ష్మీదేవియే పరబ్రహ్మము నందు నిక్షిప్తమైన రెండవ స్వరూపమనియు పరోక్ష భావమున్నది. పూదత్తాழ்వార్ తిరువడిగళే శరణమ్ ఆழ்వార్, ఎమ్బెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణమ్ ━❀꧁꧂❀┅ ధరణి ┅❀꧁꧂❀━ ONLINE CLASSES Daily from 3.30pm to 5pm FCC (Free Conference Call) LINK: https://join.freeconferencecall.com/p... TELEGRAM LINK: https://t.me/joinchat/LyoBXhelW-PjquD... YOUTUBE LINK:    / @padmajaramanujadasi   WEBSITE ADDRESS: https://padmajaramanujadasi.com/te/ WHATSAPP CHANNEL LINK: https://whatsapp.com/channel/0029Va6S... INSTAGRAM LINK https://www.instagram.com/padmaja_ram... FACEBOOK LINK   / 1evsdq7rau   అడియేన్ రామానుజదాసి🙏