ఇన్*స్టాగ్రామ్.! ఎంత పని చేసింది.! TENALI NEWS CHANNEL
TENALI NEWS CHANNEL
0:00 / 0:00
ఇన్*స్టాగ్రామ్.! ఎంత పని చేసింది.! TENALI NEWS CHANNEL
3 577 просмотров · 1 день назад
TENALI NEWS CHANNEL
97,2 тыс. подписчиков
3 577 просмотров · 1 день назад
ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మాయమాటలతో మహిళకు మోసం
తెనాలిలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు.. మాయమాటలు చెప్పి మహిళ వద్ద నుంచి రూ.1.30 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు తీసుకుని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
తెనాలి టూ టౌన్ సీఐ రవీంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గంగానమ్మపేటకు చెందిన ఉమా కీర్తనకు.. తెనాలి రూరల్ మండలం కాటేవరం కాల్వకట్టపై నివసించే పవన్ సాయి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు.
ఆ తర్వాత ఫోన్‌లో మాట్లాడుతున్న పవన్ సాయి.. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ మాయమాటలు చెప్పి ఆమె వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తన ఆభరణాల గురించి మహిళ అడగడంతో.. ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను చంపుతానంటూ పవన్ సాయి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో బాధితురాలు సెప్టెంబర్ 10న తెనాలి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పవన్ సాయి కోసం గాలించారు.
సెప్టెంబర్ 16న కాటేవరం వద్ద పవన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి బంగారు గొలుసు, రెండు బంగారు ఉంగరాలు, వెండి పట్టాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రవీంద్రబాబు తెలిపారు.
ఈ వివరాలను తెనాలి టూ టౌన్ సీఐ రవీంద్రబాబు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో రాజ్యలక్ష్మితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
🔴 తెనాలి మరియు పరిసర ప్రాంతాల తాజా వార్తల కోసం Tenali Newsను Subscribe చేయండి.
👍 వీడియో నచ్చితే Like చేయండి
🔔 తాజా వార్తల కోసం Bell Icon నొక్కండి
📲 ఈ వార్తను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Share చేయండి