Перейти к содержимому

తెనాలిలో అర్ధరాత్రి ఏం జరిగింది.? రంగంలోకి పోలీసులు, ఫైర్ సిబ్బంది.!

TENALI NEWS CHANNEL

0:00 / 0:00

తెనాలిలో అర్ధరాత్రి ఏం జరిగింది.? రంగంలోకి పోలీసులు, ఫైర్ సిబ్బంది.!

38 880 просмотров · 5 дней назад
TENALI NEWS CHANNEL
97,2 тыс. подписчиков
38 880 просмотров · 5 дней назад
తెనాలిలో అర్ధరాత్రి ఒక్కసారిగా ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చారు...అసలు ఏమైంది.!? నాజర్‌పేట ప్రాంతంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారించగా అతడు బీహార్‌కు చెందిన వ్యక్తిగా, మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం. అనంతరం అతడిని తెనాలి రైల్వే స్టేషన్ వద్ద వదిలేశారు. అయితే రాత్రి సమయంలో రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న మహిళలతో అతడు ఏదో మాట్లాడుతున్నాడని చెప్పడంతో కొందరు బంధువులు అతని వెంటపడ్డారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో తెనాలి పట్టణం మధ్యగా ప్రవహించే పంట కాల్వలోకి యువకుడు దూకినట్లు సమాచారం. కాల్వలో ఈదుకుంటూ మార్కెట్ వంతెన వరకు వెళ్లిన యువకుడు అక్కడ చెట్లను పట్టుకుని ఉండిపోయాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ CI రాంబాబు అక్కడికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇరిగేషన్ అధికారులకు కూడా సమాచారం అందించి నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. కాల్వకు ఇరువైపులా ఎత్తైన సైడ్ వాల్స్ ఉండటంతో యువకుడు బయటకు రాలేక దాదాపు రెండు గంటల పాటు నీటిలోనే ఉండిపోయాడు. చివరకు ఫైర్ సిబ్బంది నిచ్చెనలు ఏర్పాటు చేసి అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాల్వలో దూకిన సమయంలో యువకుడి తలకు గాయమైనట్లు సమాచారం. అతడిని తొలుత తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. గమనిక: ఈ కథనంలోని వివరాలు అందిన సమాచారంపై ఆధారపడి ఉన్నాయి. 0:00 తెనాలిలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన 0:45 యువకుడి అనుమానాస్పద సంచారం మరియు పోలీసుల విచారణ 1:30 పంట కాల్వలోకి దూకిన యువకుడు 2:15 ఫైర్ సిబ్బంది మరియు పోలీసుల రెస్క్యూ ఆపరేషన్ 3:30 యువకుడికి వైద్య చికిత్స మరియు పూర్తి వివరాలు #TenaliNews #Tenali #TenaliLatestNews #TenaliNewsToday #TenaliUpdates #AndhraPradeshNews #GunturNews #RescueOperation #TenaliPolice #FireDepartment #NewsUpdate #TeluguNews