Перейти к содержимому

SAIMA Beauty & Fashion EXPO in VIZAG | విశాఖలో 'సైమా ప్రొఫెషనల్ ఎక్స్పో’ #fashionshow #fashion

NEWS9 ANDHRA

0:00 / 0:00

SAIMA Beauty & Fashion EXPO in VIZAG | విశాఖలో 'సైమా ప్రొఫెషనల్ ఎక్స్పో’ #fashionshow #fashion

41 просмотр · 10 дней назад
NEWS9 ANDHRA
50 подписчиков
41 просмотр · 10 дней назад
విశాఖలో 'సైమా ప్రొఫెషనల్ ఎక్స్పో’ అందం, ఆరోగ్యం రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేస్తూ సౌత్ బ్రైడ్ మేకప్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్‌పో మరియు ఫాషన్ షో విశాఖ లోని నగరంలోని అంబేద్కర్ భవనం లో లో ఘనంగా జరిగింది.. ఈ సందర్బంగా తల్లులు, పిల్లలు ఫెషన్ షో అలరించింది.. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కందుల నాగరాజు లు మాట్లాడుతూ, ఇప్పటి వరకు దేశంలోని మెట్రో నగరాలకే పరిమితమైన ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రీమియం ఎక్స్‌పోను ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విశాఖపట్నంలో నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ బ్యూటీ నిపుణులను, ప్రముఖ బ్రాండ్లను, పంపిణీదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ఎక్స్‌పో ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎక్స్‌పో నిర్వాహకుడు మోక్ష మాట్లాడుతూ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్‌లో వస్తున్న సరికొత్త మార్పులు, ఉత్పత్తులు ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అన్నారు.. ప్రఖ్యాత బ్యూటీ బ్రాండ్లు, స్కిన్ కేర్ సొల్యూషన్స్, హెయిర్ కేర్, కాస్మెటిక్స్, నెయిల్ కేర్ స్పా సేవలకు సంబంధించిన స్టాళ్లు సందర్శకులను అలరించనున్నాయి. కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా, నిపుణుల ద్వారా ప్రత్యేక వర్క్ షాప్‌లను కూడా నిర్వహించమన్నారు తద్వారా ఔత్సాహికులు నూతన మెళకువలను నేర్చుకునే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. బ్యూటిషన్ కోర్స్ ద్వారా మహిళలు తమ కాళ్ళ పై నిలబడి ఉపాధి పొందెందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. . ​ఈ కార్యక్రమంలో జ్యురీ గా ప్రముఖ క్లోడ్ మీడియా చైర్మన్ బ్రహ్మ శ్రీ రామకృష్ణ చారి, ఆమోద్, సుదీర్,సంగీత తదితరులు పాల్గొని విజేతలకు అవార్డు లు అందజేశారు