Перейти к содержимому

Pancharatna Keerthana/Jagadananda karaka song meaning/Video 672/జగదానంద కారకజయ జానకీ ప్రాణనాయక

ARTA

0:00 / 0:00

Pancharatna Keerthana/Jagadananda karaka song meaning/Video 672/జగదానంద కారకజయ జానకీ ప్రాణనాయక

140 просмотров · 1 месяц назад
ARTA
432 подписчика
140 просмотров · 1 месяц назад
Lyrics by Smt Suvarna Lakshmi/Music generated by AI జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక । జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక ॥ సుగుణాభిరామ, ఆనంద అంతర్యామి స్వరూప పరబ్రహ్మమా శ్రీరామ, గోవింద, వేదవేద్య । సచ్చిదానంద, జగదాధార, సీతాపతి భక్తహృదయ నివాస, ప్రేమమయ నాదాత్మక, జగదాదిజా ॥ జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక ॥ మహిమాన్విత, సూర్యవంశావతార రాజాధిరాజ, సకల సద్గుణ గుణధామ । సకల దేవతార్చిత, భక్తజన శుభ మంగళదాయక కాలాతీత ప్రభవ, ఆనంద స్వరూపా శ్రీరామ ॥ జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక ॥ సుందరాంగ, కమలహిత చంద్రుని వోలె నక్షత్ర సమూహమువంటి సురారిపుల గాచు । ఆర్తత్రాణ, నిత్యశుద్ధ, దివ్య పరిపూర్ణ ఆనంద కరుణాసాగర, క్షీరసాగర శయన । మాధుర్య పలుకులొలుకు సానంద గోవింద శుభదాయక ॥ జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక ॥ వేద సరోజ దివ్యజ్ఞానామృతోద్దార బ్రహ్మాండ పిండాండ సృష్టి పోషక । రెప్పవేయక, సురగణ వైరి ఘనమేఘముల చెదరగొట్టు, భీకర వాయువీర । గరుడవాహన, సత్కవి హృదయనివాస అగణిత సుగుణ వానరాధిప, నీ పదములే శరణు ॥ జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక ॥ అనంత తత్త్వ, ఘననీలశ్యామ జ్ఞానచంద్ర, సూర్యతేజ, కొలవగరాని సకలేశ । బ్రహ్మజనక, నిర్మల, ఆదిశేష శయన, సురార్చిత అహల్యా శాప విమోచక, చైతన్య పరబ్రహ్మ । యజ్ఞరక్షక, విశ్వామిత్ర శ్రేష్ఠ శిష్య ప్రశాంతచిత్త, జనకపుత్రి వల్లభా । బ్రహ్మాది సురవర దాయక ॥ జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక ॥ సృష్టి స్థితి లయకారక, పరబ్రహ్మ అమిత కామిత ఫలదాయక । అసమాన దివ్య సౌందర్య గాత్రా శచీపతి నుత, సాగర మదహర వీర । అనురాగ, నాదరాగ దివ్యచరిత సారా, మంగళకర ॥ జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక ॥ సజ్జన హృదయ చైతన్య సుధాకర శీతల చంద్ర తాపహిత । ధర్మపుష్ప దివ్యవిమాన విరాజిత శత్రు సంహార, శ్రీలక్ష్మీ కరకమల పూజిత పద్మపాద । అసుర అవగుణ, మదహరా నిత్య బ్రహ్మాది నుత, నీ దివ్య చరణ శరణు ॥ జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక ॥ శ్రేష్ఠ శిష్య రామ, గురు మహర్షి అగస్త్య నుత సిందూర తిలకాంచిత, సుందర చెక్కిలి । ఘనధీర గంభీర, మహామేఘ రావణ అహంకార సంహార ఘనపవన రామ । దేవగణ వరప్రదాయక నిర్మల కవి హృదయాలయ నాదస్థిత ॥ జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక ॥ కరమున ధర్మసంకల్ప శరముల చేబట్టి అసుర మదాపహర, భూసుర రక్షక । మహాకవి వల్మీకోద్భవ వాల్మీకి కృత దివ్యచరిత్ర శ్రీమద్రామాయణ సన్నుత నాదబ్రహ్మమా । శ్రీత్యాగరాజ స్తుత శ్రీరామ ధర్మస్వరూప, వాల్మీకి వాక్స్వరూప ॥ జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక ॥ పురాణ అవతార పురుష, ఆదిదేవ దశరథపుత్ర, ఖర విరాధ రావణ । దుష్ట రాక్షస సంహారక పరాశర ముని మనో ఆకర్షక । పరబ్రహ్మ స్వరూప త్యాగరాజ సన్నుత భక్త పరాధిపా హేమాంగా ॥ జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక ॥ అగణిత కల్యాణ గుణాభిరామ సువర్ణ పీతాంబరధర । సాలవృక్ష ఛేదక అరుణకాంతి దివ్య పాదాబ్జ । అపార వైభవ మహిమాన్విత సత్కవి మనోవిహార, భక్తహృదయ నామ రామ । దేవముని గణవందిత, శ్రీలక్ష్మీనారాయణ పాప గజవధ నృసింహ । త్యాగరాజాది నుత శ్రీరామా ॥ జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక ॥ జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక ॥