Перейти к содержимому

Edu-padagala Needana/ Video 682/ ఏడు పడగల నీడన శ్రీధరుని కొనివచ్చే

ARTA

0:00 / 0:00

Edu-padagala Needana/ Video 682/ ఏడు పడగల నీడన శ్రీధరుని కొనివచ్చే

34 просмотра · 21 час назад
ARTA
432 подписчика
34 просмотра · 21 час назад
Lyrics by Smt Suvarna Lakshmi/ Music generated by AI ఏడు పడగల నీడన శ్రీధరుని కొనివచ్చే ఏడు కొండలు తానైన పెద్ద శేషుడు॥ ఏడు పడగల నీడన శ్రీధరుని కొనివచ్చే ఏడు కొండలు తానైన పెద్ద శేషుడు॥ అంతులేని కాలమున అనంతుడై నిలిచేవాడు యుగయుగముల శ్రీకాంతుని మోసే ఆదిశేషుడు॥ ఏడు పడగల నీడన శ్రీధరుని కొనివచ్చే ఏడు కొండలు తానైన పెద్ద శేషుడు॥ కద్రువ తనయుడు కశ్యపునకు సుతుడైనాడు కడు తపమున బ్రహ్మను కరుణింపజేసినాడు ధర్మమందే మది నిలుప వరమును వేడినాడు శ్రీకాంతుని సేవలోనే చిత్తమును నిలిపినాడు॥ ఏడు పడగల నీడన శ్రీధరుని కొనివచ్చే ఏడు కొండలు తానైన పెద్ద శేషుడు॥ జగములన్నీ లయమైనా శేషమై నిలచువాడు జగదీశుని చెంతన వుండే అనంతుడనువాడు ఏడు గిరుల రూపమున శేషాద్రై వెలసినాడు ఎందెందు పరముని వీడక నిలచిన వాడు॥ ఏడు పడగల నీడన శ్రీధరుని కొనివచ్చే ఏడు కొండలు తానైన పెద్ద శేషుడు॥… అచలుడై ధరణిని అల్లాడక నిలిపినాడు జగములకు ఆధారమై జగన్నాథుని సేవించువాడు లక్ష్మణుడై రామునకు తమ్ముడై నడచినాడు బలరాముడై కృష్ణునకు అన్నయై వెలసినాడు॥ ఏడు పడగల నీడన శ్రీధరుని కొనివచ్చే ఏడు కొండలు తానైన పెద్ద శేషుడు॥ పాలకడలి నడుమ పరమాత్మకు పానుపైనాడు పడగలే గొడుగులుగా పద్మనాభుని కాచినాడు స్వామి సేవయే తనకు సకల భాగ్యమనినాడు ఎడబాయని ప్రేమతో ఎన్నో కొలువులొనరించినాడు॥ ఏడు పడగల నీడన శ్రీధరుని కొనివచ్చే ఏడు కొండలు తానైన పెద్ద శేషుడు॥ శేషుని సేవకు మెచ్చి శ్రీనివాసుడు కొలువుదీరె శేషగిరులపై నిలిచి చెలువమొప్ప వరములిచ్చె మలయప్పకు వాహనమై మెరిసి మురిసినాడు హేమాంగుని మది నిండా హరి నామమె నిలిపినాడు॥ ఏడు పడగల నీడన శ్రీధరుని కొనివచ్చే ఏడు కొండలు తానైన పెద్ద శేషుడు॥ ఏడు పడగల నీడన శ్రీధరుని కొనివచ్చే ఏడు కొండలు తానైన పెద్ద శేషుడు॥