Перейти к содержимому

Irandam Thiruvandadi53,54🙏ఇరణ్డామ్ తిరువందాది 53,54పాశురములు

Padmaja Ramanujadasi

0:00 / 0:00

Irandam Thiruvandadi53,54🙏ఇరణ్డామ్ తిరువందాది 53,54పాశురములు

3 943 просмотра · Трансляция закончилась 9 дней назад
Padmaja Ramanujadasi
57,6 тыс. подписчиков
3 943 просмотра · Трансляция закончилась 9 дней назад
నేటి ప్రశ్నలు: ఇరణ్డామ్ తిరువందాది 53, 54 పాశురములు 01 : ఆలయ పునః నిర్మాణంలో బాలాలయం ఎందుకు? సమాధానము : ఆలయ పునః నిర్మాణ సమయంలో గర్భాలయంలో ఉన్న ధృవ బేరంలో ఉన్న శక్తినంతటినీ భోగబేరం లోనికి ఆవాహన చేసి యంత్రప్రతిష్టచేసి ధృవబేరానికి నిర్వహించే కైంకర్యాలన్నింటినీ నిర్వహించుటకై బాలాలయం నిర్మిస్తారు. 02 : "బాలాలయం" ను సూచించే పాశురపదం వ్రాయండి. సమాధానము : "బాలాలయం" ను సూచించే పాశురపదం "వెళ్ళత్తు ఇళం కోయిల్" 03 : "యామ్ విరుమ్బుమ్ వెఱ్పు" అంటే ఏమిటి? సమాధానము : "యామ్ విరుమ్బుమ్ వెఱ్పు" అంటే "మనము కోరుకొనే కొండ" అని అర్థం. 04 : "నెఱియార్" అనుట ద్వారా ఎవరిని సూచించారు? సమాధానము : "నెఱి" అంటే త్రోవ/దారి అని అర్థం. తిరుమల వెళ్లే దారిలో తపస్సు చేసు కుంటూ ఉండే వారిని "నెఱియార్" అనే పదంతో సూచించారు. #irandam_thiruvandadi #pasuram53 #pasuram54 #pudattazhwar #bhuta_yogi #srirangam #thirumala #6years_of_ynv_goshti #yathirajanadhavalli_goshti #padmajaramanujadasi #acharya_vaibhavam #ramanuja_vaibhavam #bhagavad_ramanuja #thirunakshatram #divyadesalu #samasrayanalu #vaishnava_sampradayam #srivaishnavism #bhagavadvishayam #alwar #azhwar #andal #goda #krishna 53) నెఱియార్ కుழల్ కற்றெ ౹ మున్నిన్ఱు పిన్ తాழ்న్దు ౹ అఱియాదు । ఇళమ్ కిరియెన్ఱు ఎణ్ణి । ప్పిరియాదు పూఙ్గ్కొడిక్కళ్ వైకుమ్ । పొరుపునల్ కున్ఱెన్నుమ్ । వేఙ్గడమే । యామ్ విరుమ్బుమ్ వెఱ్పు ॥ 2234 ప్రతిపదార్థములు : నెఱియార్ అఱియాదు = తిరుమలలో తపోనిమగ్నులై యున్న సాధువులు ; కుழల్ కற்றெ మున్నిన్ఱు = వారి కేశముల ముందరి భాగమున జటాముడులుగను ; పిన్ తాழ்న్దు = వెనుక భాగమున వ్రేలాడుచుండగ ; ఇళ గిరి యెన్ఱు ఎణ్ణి = ఒక చిన్న కొండయని తలచి ; పూం కొడిగళ్ = పూతీగెలు ; పిరియాదువై గురి = వాటిని వీడక ప్రాకుచున్నవి ; పెరుపునల్ కున్ఱు ఎన్నుం = అనేక జలపాతముతో కూడిన తిరువేంగడమను ; వేంగడమే = వేంకటగిరియే ; యాం విరుంబుం వెఱ్పు = మనము కోరిన కొండ యగును. భావమ్ : సాధువు లత్యంత నిష్ఠతో తపమాచరించుచుండగ వారి కేశములు జటాముడులుగను, వెనుక జటాజూటముగను వ్రేలాడుచుండెను. వారి నిశ్చలత్వమునకు పూతీగెలు చూచి, చిఱుకొండలుగ భ్రమించి వాటిపై ప్రాకెను. అనేక జలపాతములతో కూడిన చల్లని వేంకటగిరియే మనకు సేవ్యమైనది. 54) వెఱ్పెన్ఱు ఇరుమ్ శోలై । వేఙ్గడమెన్ఱు ఇవ్విరణ్డుమ్ । నిఱ్పెన్ఱు । నీ మదిక్కుమ్ నీర్ మైపోల్ ౹ నిఱ్పెన్ఱు ఉళంకోయిల్ ౹ ఉళ్ళుం వైత్తు ఉళ్ళినేన్ । వెళ్ళత్తు ఇళం కోయిల్ ౹ కైవిడేల్ ఎన్ఱు ॥ 2235 ప్రతిపదార్థములు : వెఱ్పెన్ఱు = కొండగ ప్రసిద్ధి చెందిన వేంకటగిరి, ఇరుంజోలై = తిరుమాలిరుం జోలై ; ఎన్ఱు ఇవ్విరండుం = అను ఈ రెండును ; నిఱ్పు ఎన్ఱు = నిత్య వాసమని ; నీ మదిక్కుం నీరేమై పోల = నీవు భావించు గుణ విశేషము వలె ; ఉళం కోయిల్ నిఱ్పు ఎన్ఱు = నా హృదయమను ఆలయము నీవు వసించు స్థానమని ; ఉళ్ళంవైత్తు = నా మనస్సున సంకల్పించుకొని ; వెళ్ళత్తు ఇళం కోయిల్ కైవిడేల్ = క్షీరాబ్దియగు నీ వాసమును వీడకుము ; ఎన్ఱు = అని ; ఉళ్ళినేన్ = నిన్ను తలచు చున్నాను. భావమ్ : "తిరువేంకటగిరి, తిరుమాలిరుంజోలై అను రెండు దివ్య దేశములు నేను నిత్య వాసము చేయుటకు ఉచితమైనవి అని స్వామీ ! నీవు తలచు చుండుటకు సాటిగ నా హృదయాలయమున్నదనియు నీవు తలచుట నాకు తెలియును. కాని శ్రియఃపతీ ! నీకు, నిత్య నివాసమైనది క్షీరాబ్దియే. దానిని వీడకుము" అని ఆళ్వారు ప్రార్థన. పూదత్తాழ்వార్ తిరువడిగళే శరణమ్ ఆழ்వార్, ఎమ్బెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణమ్ ━❀꧁꧂❀┅ ధరణి ┅❀꧁꧂❀━ ONLINE CLASSES Daily from 3.30pm to 5pm FCC (Free Conference Call) LINK: https://join.freeconferencecall.com/p... TELEGRAM LINK: https://t.me/joinchat/LyoBXhelW-PjquD... YOUTUBE LINK:    / @padmajaramanujadasi   WEBSITE ADDRESS: https://padmajaramanujadasi.com/te/ WHATSAPP CHANNEL LINK: https://whatsapp.com/channel/0029Va6S... INSTAGRAM LINK https://www.instagram.com/padmaja_ram... FACEBOOK LINK   / 1evsdq7rau   అడియేన్ రామానుజదాసి🙏