Niraja Nayani Bhajan by Sri Ganapathi Sachidananda Swamiji
Datta Thathaji Bhajans
0:00 / 0:00
Niraja Nayani Bhajan by Sri Ganapathi Sachidananda Swamiji
3 094 просмотра · 6 месяцев назад
Datta Thathaji Bhajans
458 подписчиков
3 094 просмотра · 6 месяцев назад
పల్లవి:
నీరజ నయనీ నిజహృదయేశ్వరి
నారాయణ సతి నీవమ్మా
నీ పదములనే నిరతము నమ్మితి
నను దయజూడగ రావమ్మ
చరణం:
అఖిల జగంబుల కభయము నిచ్చెడి
అఖిలారాధ్యవు నీవమ్మా
అష్ట దరిద్రము లంతము చేసెడి
అష్టలక్ష్మివై రావమ్మా ...1
నిర్గుణ రూపిణి నిజసుఖదాయిని
నిత్యసుమంగళి నీవమ్మా
నాహృదిలోనే నిను దర్శించెడి
నిశ్చల మదినే నాకిమ్మా ...2
సజ్జన సంతతి సతతము గొల్చెడి
సద్గుణరాశివి నీవమ్మా
సుఖములు పంచుతు సుగుణము పెంచుతు
సచ్చిదానందము నాకిమ్మా ...3