Перейти к содержимому

మెదక్ లో రెయీన్ బో ఆసుపత్రి ప్రారంబించిన మున్సిపల్ చైర్పర్సన్ రాదిక, వైస్ చైర్మెన్ నరేష్ గౌడ్

Medak news channel

0:00 / 0:00

మెదక్ లో రెయీన్ బో ఆసుపత్రి ప్రారంబించిన మున్సిపల్ చైర్పర్సన్ రాదిక, వైస్ చైర్మెన్ నరేష్ గౌడ్

36 просмотров · 2 дня назад
Medak news channel
312 подписчиков
36 просмотров · 2 дня назад
మెదక్ రైన్బో ఆసుపత్రిలో ప్రత్యేక ఆరోగ్య పథకాల ప్రారంబించిన మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఉచిత వైద్య పరీక్షలు.. మందులు, ఇతర వైద్య ఖర్చులపై 50 శాతం వరకు రాయితీ మెదక్, సెప్టెంబర్ 18: మెదక్ పట్టణంలోని అజాంపురా ప్రాంతంలో ఉన్న రైన్బో మదర్ అండ్ చైల్డ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఆరోగ్య పథకాలను ప్రారంభించారు. సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రి బాధ్యులు మహ్మద్ ఫరీద్ అహ్మద్ ఖాన్ నదీమ్, మహ్మద్ బుర్హానుద్దీన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు కూడా ఆసుపత్రులను ఆశ్రయించే ప్రజలు వైద్య పరీక్షలు, మందులు, ఇతర వైద్య సేవల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రైన్బో ఆసుపత్రి ప్రత్యేక ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలలో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జనరల్ ఫిజిషియన్, పీడియాట్రిక్, గైనకాలజిస్ట్ నిపుణులచే ఉచిత వైద్య సంప్రదింపులు, పరీక్షలు అందించనున్నారు. అదేవిధంగా మందులు మరియు ఇతర సంబంధిత వైద్య ఖర్చులపై 50 శాతం వరకు రాయితీ అందించనున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రత్యేక ఆరోగ్య పథకాలను మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి కానుగో రాధిక భూపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా రైన్బో ఆసుపత్రి అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఆరోగ్య రంగంలో ప్రజలకు అందుబాటులో ఉండే ఇలాంటి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెదక్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ డి. నరేష్ గౌడ్ మాట్లాడుతూ రైన్బో ఆసుపత్రి ప్రారంభించిన ప్రత్యేక ఆరోగ్య పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని అవసరమైన వైద్య సేవలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు మహ్మద్ జుబేర్ అహ్మద్, మహ్మద్ మన్సూర్, మహ్మద్ ఇమ్దాద్ అలీ, శేఖర్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ తాహెర్ అలీ, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహ్మద్ ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అంజలి, డాక్టర్ గౌతమ్లను ఘనంగా సన్మానించారు. ప్రజలు రైన్బో ఆసుపత్రి అందిస్తున్న ప్రత్యేక ఆరోగ్య పథకాలను సద్వినియోగం చేసుకుని వైద్య సేవలను పొందాలని వారు విజ్ఞప్తి చేశారు అనంతరం ఆసుపత్రి బాధ్యులు మహ్మద్ ఫరీద్ అహ్మద్ ఖాన్ నదీమ్ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ ప్రజాప్రతినిధులు, వైద్యులు, అతిథులు మరియు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.