E471| పంటల వైవిధ్యమే... ప్రధాన పంటకు ఆర్థిక బలం | జి మంజునాథ్ | సత్యసాయి జిల్లా
Andhra Pradesh Community Managed Natural Farming
0:00 / 0:00
E471| పంటల వైవిధ్యమే... ప్రధాన పంటకు ఆర్థిక బలం | జి మంజునాథ్ | సత్యసాయి జిల్లా
1 263 просмотра · 8 дн. назад
Andhra Pradesh Community Managed Natural Farming
26,2 тыс. подписчиков
1 263 просмотра · 8 дн. назад
సత్యసాయి జిల్లా మడకశిర మండలం మరువపల్లి గ్రామానికి చెందిన జి. మంజునాథ్ గారు ప్రకృతి వ్యవసాయంతో దానిమ్మ సాగులో మంచి ఫలితాలను సాధించారు. గతంలో అధిక పెట్టుబడులు, రసాయనాల వినియోగంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన, రైతు సాధికార సంస్థ బృందం సూచనలతో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. రెండు ఎకరాల్లో దానిమ్మతో పాటు పీఎండీఎస్, అంతర పంటలను సాగు చేస్తూ భూమిలో తేమను నిల్వ చేసుకోవడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ధనియాలు, పుదీనా, ముల్లంగి, బీట్‌రూట్, టమాటా వంటి అంతర పంటల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దానిమ్మ తోట నిర్వహణకు వినియోగించారు. 6 టన్నుల దానిమ్మను విక్రయించి ఆదాయం పొందినట్లు తెలిపారు. తక్కువ పెట్టుబడి, నేల ఆరోగ్యం, పంట నాణ్యతతో ప్రకృతి వ్యవసాయం తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిందని రైతు వ్యక్తం చేశారు.