మా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం | గానగంధర్వుడికి హృదయపూర్వక నివాళి|A HUMBLE TRIBUTE TO BALU| n m rao bandi
RHYTH-M🎙️C RAGA
0:00 / 0:00
మా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం | గానగంధర్వుడికి హృదయపూర్వక నివాళి|A HUMBLE TRIBUTE TO BALU| n m rao bandi
7 048 просмотров · 3 недели назад
RHYTH-M🎙️C RAGA
387 подписчиков
7 048 просмотров · 3 недели назад
మా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం | గానగంధర్వుడికి హృదయపూర్వక నివాళి|A HUMBLE TRIBUTE TO BALU| n m rao bandi
🎵 *మా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం* 🎵
అపూర్వమైన గాన మాధుర్యంతో ఎన్నో తరాల హృదయాలను అలరించిన *గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారికి* ఈ గీతం అంకితం.
ఆయన పాడిన ప్రతి పాట ఒక మధుర జ్ఞాపకం…
ఆయన స్వరం మనసులను కదిలించే ఒక అపూర్వ రాగం…
తెలుగు సినీ సంగీతానికి, భారతీయ సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.
*“మా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం”* అనే ఈ పాట ద్వారా ఆయనపై ఉన్న అభిమానాన్ని, కృతజ్ఞతను, గౌరవాన్ని నా గీత రూపంలో వ్యక్తం చేస్తున్నాను.
బాలు గారి గానం ఎప్పటికీ మా చెవులకు వేణునాదమే…
ఆయన పేరు ఎప్పటికీ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 🙏🎶
*గానగంధర్వుడికి హృదయపూర్వక నివాళి.*
*Lyrics: n m rao bandi*
*Video Visualization & Editing : E Sai Chandu & Sampath*
🎵 *Maa S. P. Balasubrahmanyam* 🎵
A heartfelt musical tribute to the legendary **S. P. Balasubrahmanyam**, whose extraordinary voice touched generations of music lovers.
Every song he sang remains a beautiful memory, and every note of his voice continues to live in the hearts of millions. His immense contribution to Telugu cinema and Indian music will always be remembered.
Through *“Maa S. P. Balasubrahmanyam,”* I express my love, gratitude, admiration, and respect for the legendary singer whose voice became an unforgettable part of our lives.
*A humble tribute to the immortal voice of Balu.* 🙏🎶
*Lyrics: n m rao bandi*
*Video Visualization & Editing : E Sai Chandu & Sampath*
LYRICS :
మా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం
నువ్వే మా భరత జాతి పుణ్యం
నిన్నిచ్చిన తెలుగు నేల ధన్యం
నువ్విచ్చిన పాట మాకు మాన్యం
నువ్వొచ్చిన పుణ్యభూమి ధన్యం
మా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం
నువ్వే మేం చేసుకున్న పుణ్యం
నిన్నిచ్చిన తెలుగు నేల ధన్యం
నువ్విచ్చిన పాట మాకు మాన్యం
నువ్వే మా భరత జాతి రత్నం
[chorus]
(బాలూ బాలూ .. బాలూ బాలూ ...
బాలూ బాలూ .. బాలూ బాలూ ...)
1)
గీతమే పలికావంటే
ఆ కవిది భాగ్య ఫలం
పాటవై కులికావంటే
ఆ పాట మాకు వరం
హృదయాలు కదిపే గానం
నీదైతె తెలియదు కాలం
హృదయాలు కలిపే రాగం
మాకైతె తెలియదు కాలం
నీ గానమెప్పుడూ
మా చెవికి వేణు రవం
[chorus]
(బాలూ బాలూ .. బాలూ బాలూ ...
బాలూ బాలూ .. బాలూ బాలూ ...)
మా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం
నువ్వే మేం చేసుకున్న పుణ్యం
నిన్నిచ్చిన తెలుగు నేల ధన్యం
నువ్విచ్చిన పాట మాకు మాన్యం
నువ్వే మా భరత జాతి రత్నం
2)
రాగమే సాగాలంటే
నీ గొంతు దైవ స్వరం
నీ సరే పాడాలంటే
దేవ ఋషి నీకు సమం
మా కొరకు వచ్చిన నువ్వే
దేనికని వదిలెళ్ళావో
మా కొరకు వచ్చిన నువ్వే
ఎవరికని కదిలెళ్ళావో
నీ పేరు ఎప్పుడూ
ఈ భువికి ప్రాణప్రదం
[chorus]
(బాలూ బాలూ .. బాలూ బాలూ ...
బాలూ బాలూ .. బాలూ బాలూ ...)
మా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం
నువ్వే మా భరత జాతి పుణ్యం
నిన్నిచ్చిన తెలుగు నేల ధన్యం
నువ్విచ్చిన పాట మాకు మాన్యం
నువ్వొచ్చిన పుణ్యభూమి ధన్యం
[chorus]
(బాలూ బాలూ .. బాలూ బాలూ ...
బాలూ బాలూ .. బాలూ బాలూ ...)