హృదయపూర్వక వందనము / Song - 268
క్రైస్తవ సునాద కీర్తనలు
0:00 / 0:00
హృదయపూర్వక వందనము / Song - 268
92 просмотра · 8 дней назад
క్రైస్తవ సునాద కీర్తనలు
113 подписчиков
92 просмотра · 8 дней назад
హృదయపూర్వక వందనము - ఈ ఉదయకాలము జేతుము
సదయుడగు శ్రీయేసునాథుని - సన్నిధిని ధ్యానింతుము
1) మాదు పడకలనుండి మమ్ముల - మాన్యుడా కాపాడితి - కంఠ
స్వరముల నెత్తి స్తోత్రము - మింట కెగయ పాడెదం
2) పాపులు వసియించు చుండెడి - దాపు చేరక చూడుమా
దుష్టుల ఆలోచనలలో ఇష్టమును రానీకుమా
3) దేవా నీదు ధర్మశాస్త్రము - నందు ఆనందించుచు
దివారాత్రము దానియందే - ధ్యానమున్ దయచేయుమా
4) నీవే మార్గము నీవే సత్యము - నీవే జీవము మాకిలన్
నీవే గాకింకెవరు దేవా - నిరతము మము గావుమా
5) మేము నిలిచెడి స్థలములందున - మాదు వ్యాపారంబున
సాగనంపుము మమ్ము నీకు - సాక్షులనుగా నిలుపుమా